Best 650cc Bikes: యూత్‌కి నిద్ర పట్టుకుండా చేసే బైక్స్.. ఈ లిస్ట్‌లో మీ ఫేవరేట్ బైక్ కూడా ఉండొచ్చు..!

Best 650cc Bikes
x

Best 650cc Bikes: యూత్‌కి నిద్ర పట్టుకుండా చేసే బైక్స్.. ఈ లిస్ట్‌లో మీ ఫేవరేట్ బైక్ కూడా ఉండొచ్చు..!

Highlights

Best 650cc Bikes: ఇండియాలో 650సిసి సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లకు ఆదరణ వేగంగా పెరుగుతోంది.

Best 650cc Bikes: ఇండియాలో 650సిసి సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లకు ఆదరణ వేగంగా పెరుగుతోంది. ఈ బైక్‌లు హైవేపై అద్భుతమైన పనితీరుతో పాటు మంచి మైలేజీని అందిస్తాయి. అన్ని రకాల రైడర్లకు అనువుగా ఉండే క్రూయిజర్, స్పోర్ట్స్, రెట్రో స్టైల్ బైక్‌లను చాలా కంపెనీలు ఈ విభాగంలో ప్రవేశపెట్టాయి. మీరు 650సిసి బైక్‌లను కొనాలని చూస్తుంటే అటువంటి ఉత్తమ మోడల్స్ గురించి తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 అనేది బాబర్-స్టైల్ డిజైన్‌తో నియో-రెట్రో క్రూయిజర్ బైక్. "షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్" అనే లిమిటెడ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. బైక్‌లో 648సిసి సమాంతర-ట్విన్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 46.3 హెచ్‌పి పవర్, 52.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్, USD టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్పర్ క్లచ్, డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్, USB ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.3.5 లక్షల ఎక్స్-షోరూమ్.

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 అనేది ఒక క్లాసిక్ రెట్రో బైక్, వింటేజ్ బైక్‌లను ఇష్టపడే రైడర్‌లకు గోల్డ్‌స్టార్ మంచి ఆప్షన్. బైక్‌లో 652cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 44.3 బిహెచ్‌పి పవర్, 55 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, స్పోక్డ్ వీల్స్ , టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్‌, డ్యూయల్-ఛానల్ ABS, డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. ధర రూ. 3 లక్షలు ఎక్స్-షోరూమ్.

రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650

రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 అనేది ఒక కేఫ్-రేసర్ స్టైల్ బైక్, బైక్ స్పోర్టి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కాంటినెంటల్‌లో 648సిసి సమాంతర-ట్విన్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 46.3 బిహెచ్‌పి పవర్, 52.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ డయల్-టైప్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కేఫ్-రేసర్ లుక్‌తో వస్తుంది. డ్యూయల్-డిస్క్ బ్రేక్ సెటప్, ABS , USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బైక్ ధర రూ. 3.5 లక్షల ఎక్స్-షోరూమ్.

హోండా CBR 650R

హోండా CBR 650R అనేది ఫుల్ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్. ఈ సూపర్ బైక్‌లో 649సిసి ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 85.8 బిహెచ్‌పి పవర్, 57.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, అసిస్ట్-స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.10 లక్షల ఎక్స్-షోరూమ్.

Show Full Article
Print Article
Next Story
More Stories