Cheapest 125CC Bikes: దూకుడులో ఈ రెండు బైక్‌లదే టాప్ గేర్.. వాటి ప్రత్యేకతలు, ధరలు

Cheapest 125CC Bikes
x

Cheapest 125CC Bikes: దూకుడులో ఈ రెండు బైక్‌లదే టాప్ గేర్.. వాటి ప్రత్యేకతలు, ధరలు

Highlights

Cheapest 125cc Bikes: దేశంలో 125CC ఇంజన్ ఉన్న బైక్‌ల హవా నడుస్తోంది. ఈ 125CC బైక్‌ల సెగ్మెంట్‌ను పవర్‌తో పాటు మెరుగైన మైలేజీ కోసం చూస్తున్న కస్టమర్‌లు...

Cheapest 125cc Bikes: దేశంలో 125CC ఇంజన్ ఉన్న బైక్‌ల హవా నడుస్తోంది. ఈ 125CC బైక్‌ల సెగ్మెంట్‌ను పవర్‌తో పాటు మెరుగైన మైలేజీ కోసం చూస్తున్న కస్టమర్‌లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ సెగ్మెంట్‌లోని కొన్ని బైక్‌లు రికార్డ్ స్థాయిలో సేల్ అవుతున్నాయి. వీటి సాధారణ డిజైన్‌ బైక్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది. డైలీ అవసరాలకు, ఆఫీసులకు వెళ్లడానికి ఈ బైకులు మంచి ఆప్షన్. అంతేకాకుండా వాటి రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. అలానే మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌కు సరిపోతాయి. ఈ బైకుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హోండా 125

125CC బైక్ సెగ్మెంట్లో హోండా షైన్ అమ్మకాల పరంగా ప్రతి నెలా అగ్రస్థానంలో ఉంటుంది. ఈ బైక్ డిజైన్ కారణంగా ఈ బైక్‌ను ప్రజలు అధికంగా కొంటున్నారు. బైక్‌లో 124CC ఎస్ఐ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7.9 కెడబ్ల్యూ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది.

ARAI ప్రకారం.. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మెరుగైన బ్రేకింగ్ కోసం బైక్‌లో ముందు 240 మిమీ డిస్క్, వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. అలానే బైక్‌లో 18 అంగుళాల టైర్లు కూడా ఉన్నాయి. బైక్ ధర రూ.83,251 నుంచి ప్రారంభమవుతుంది.

హీరో సూపర్ స్ప్లెండర్

బైక్ సింపుల్, క్లాసిక్ లుక్ ఇవ్వాలనుకొనే వారికి హీరో సూపర్ స్ప్లెండర్ ప్లస్ సరైన ఆప్షన్. బైక్‌లో 10.7Bhp హార్స్ పవర్, 10.6 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే 124.7CC ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ బైక్ ఒక లీటర్‌లో దాదాపు 55-57కిమీల మైలేజ్ అందిస్తుంది.

ఫీచర్ల గురించి చెప్పాలంటే బైక్‌ను సైడ్ స్టాండ్‌లో పార్క్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వదు. సేఫ్టీ పరంగా ఇది మంచి ఫీచర్. బైక్ ముందు టైరులో 240mm డిస్క్, వెనుక టైరులో 130mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్‌కు 18 అంగుళాల టైర్లు అమర్చారు. బైక్ ధర రూ.86128 నుంచి ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories