Bajaj Pulsar 125 CC Bike: వచ్చేసింది బజాజ్‌ పల్సర్‌ 125 సీసీ బైక్‌.. సూపర్‌ ఫీచర్స్‌ ఇంకా ఆకర్షణీయమైన రంగుల్లో..!

Bajaj Pulsar 125 cc Bike has Arrived Super features and Attractive Colors
x

Bajaj Pulsar 125 CC Bike: వచ్చేసింది బజాజ్‌ పల్సర్‌ 125 సీసీ బైక్‌.. సూపర్‌ ఫీచర్స్‌ ఇంకా ఆకర్షణీయమైన రంగుల్లో..!

Highlights

Bajaj Pulsar 125 CC Bike:బజాజ్‌ కంపెనీ అత్యత్తమ బైక్‌ అయిన పల్సర్‌ సెగ్మెంట్‌లో కొత్తగా 125 సీసీ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా మంచి రంగుల్లో లభిస్తుంది.

Bajaj Pulsar 125 CC Bike: బజాజ్‌ కంపెనీ అత్యత్తమ బైక్‌ అయిన పల్సర్‌ సెగ్మెంట్‌లో కొత్తగా 125 సీసీ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా మంచి రంగుల్లో లభిస్తుంది. పల్సర్‌ 150, 250 బైక్‌ల మాదిరి ఇందులో కూడా అన్ని ఫీచర్లను యాడ్‌ చేశారు. అంతేకాదు ధర కూడా తక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. పల్సర్‌ 125 సీసీ బైక్‌ గురించి మరిన్ని వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఆధారంగా ఈ బైక్ డిజైన్, హార్డ్వేర్ విషయంలో పెద్దగా మార్పులు లేవని తెలుస్తుంది. అయితే మస్కులర్ బాడీవర్క్, డీఆర్‌ఎల్‌తో హాలోజన్ హెడ్లైట్, సిట్ సీట్, గ్రాబ్ రైల్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ స్ప్రింగ్లు, వెనుక డ్రమ్ బ్రేక్ల తో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. 124.4 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పాటు ఈ బైక్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. అలాగే ఈ బైక్ పవర్, టార్క్ ఫిగర్లను వరుసగా 11.64 బీహెచ్‌పీ, 10.8 ఎన్ఎం అందిస్తుంది.

కొత్త ఫీచర్ల యాడ్‌ విషయానికి వస్తే పల్సర్ 125 ధరను దాని ప్రస్తుత రూ. 90,003 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి కొద్దిగా పెంచవచ్చు. ఈ బైక్ 125 సీసీ విభాగంలో పోటీ పడుతోంది. ఈ బైక్ హెూండా ఎస్‌పీ 125, టీవీఎస్ రైడర్ 125, హీరో గ్లామర్, ఎక్స్‌ట్రీమ్‌ 125 వంటి మోడల్స్‌కు గట్టి పోటీనిస్తుంద ని నిపుణులు అంచనా వేస్తన్నారు. అలాగే బజాజ్ పల్సర్ 400ని కూడా విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. బైక్‌ లవర్స్‌కు పల్సర్‌ 125 సీసీ బాగా నచ్చుతందుని కంపెనీ ప్రతినిధులు అంచనావేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories