Bajaj Chetak Electric Sales: అమ్మకాల్లో దుమ్మురేపిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్.. ఈ కంపెనీలను వెనక్కి నెట్టేసింది..!

Bajaj Chetak Electric Sales
x

Bajaj Chetak Electric Sales: అమ్మకాల్లో దుమ్మురేపిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్.. ఈ కంపెనీలను వెనక్కి నెట్టేసింది..!

Highlights

Bajaj Chetak Electric Sales: గత నెల ఫిబ్రవరిలో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 21,387 యూనిట్లను విక్రయించింది, దీనితో ఈ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా నిలిచింది.

Bajaj Chetak Electric Sales: గత నెల ఫిబ్రవరిలో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 21,387 యూనిట్లను విక్రయించింది, దీనితో ఈ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా నిలిచింది. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో చేతక్ స్కూటర్ 11,764 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే కంపెనీ ఈ స్కూటర్‌ను 9625 యూనిట్లు ఎక్కువగా విక్రయించింది. దీనితో ఈ స్కూటర్ వృద్ధి 81.82శాతం. ఫిబ్రవరి నెలలో దాని మార్కెట్ వాటా 28.11శాతం. బజాజ్ చేతక్ స్కూటర్‌కు ఇప్పుడు భారతదేశంలో డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

టీవీఎస్ ఐక్యూబ్ గత నెలలో 18,762 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచింది. ఇది కాకుండా ఏథర్ మూడవ స్థానాన్ని ఆక్రమించి, 8,647 స్కూటర్లను విక్రయించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగో స్థానంలో ఉంది. ఓలా మొత్తం 8,647 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి.

బజాజ్ ఆటో గత ఏడాది మార్కెట్లోకి కొత్త చేతక్ 35 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. కొత్త చేతక్ మునుపటి కంటే మరింత అధునాతనంగా మారింది. దీనితో దాని అమ్మకాలు పెరిగాయి. ఈ స్కూటర్‌లో అనేక కొత్త, ముఖ్యమైన ఫీచర్లు కూడా చేరాయి. కొత్త చేతక్ 35 సిరీస్‌లో 3.5 కిలోవాట్ అండర్‌ఫ్లోర్ బ్యాటరీ ప్యాక్ ఉంది.

బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, దాని రియల్ టైమ్ రేంజ్ 125 కిమీగా ఉంటుంది. ఇందులో 950W ఆన్‌బోర్డ్ ఛార్జర్ సౌకర్యం కూడా ఉంది. కేవలం 3 గంటల్లో దాని బ్యాటరీ 80శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ మొత్తం రెండు వేరియంట్లలో విడుదల చేసింది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 1,20,00 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 1,27,243.

Show Full Article
Print Article
Next Story
More Stories