కారు లోన్‌ కంప్లీట్‌ అయిందా.. వెంటనే ఈ పని చేయండి లేదంటే కారు అమ్మలేరు..!

As soon as the car loan is completed take the NOC and remove the Hypothecation at the RTO office
x

కారు లోన్‌ కంప్లీట్‌ అయిందా.. వెంటనే ఈ పని చేయండి లేదంటే కారు అమ్మలేరు..!

Highlights

Car Loan Completed: ఈ రోజుల్లో చాలామంది బ్యాంకులో లోన్‌ తీసుకొని కారు కొంటున్నారు. బ్యాంకులు కూడా సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి.

Car Loan Completed: ఈ రోజుల్లో చాలామంది బ్యాంకులో లోన్‌ తీసుకొని కారు కొంటున్నారు. బ్యాంకులు కూడా సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. కస్టమర్లు కూడా ఈఎంఐల ద్వారా కారు లోన్‌ని పూర్తిచేస్తున్నారు. ఇంకేముంది కారు సొంతమైందని రిలాక్స్‌ అవుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తర్వాత జరిగే ప్రాసెస్‌ గురించి మరిచిపోతున్నారు. దీనివల్ల కారు అమ్మేటప్పుడు చిక్కుల్లో పడుతున్నారు. కారు యజమానులు పలు సమస్యలని ఎదుర్కొంటున్నారు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.NOC

హైపోథెకేషన్ అంటే ఏమిటి?

కారు లోన్‌ పూర్తయిన తర్వాత బ్యాంక్ నుంచి NOC (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) పొందాలి. తర్వాత హైపోథెకేషన్ తొలగించాలి. లేదంటే కారుని అమ్మలేరు. మీరు షోరూమ్‌కి వెళ్లి కారు ధర చూసినప్పుడు బ్రేకప్‌లో హైపోథెకేషన్ ఛార్జ్ కనిపిస్తుంది. మీ పేరు మీద కారు రిజిస్టర్ అయినప్పుడు బ్యాంకు పేరు కూడా RTO రికార్డులలో నమోదవుతుంది. కారు లోన్ ముగిసిన తర్వాత కచ్చితంగా ఆర్టీవో ఆఫీసులకి వెళ్లి హైపోథెకేషన్ తొలగింపును పూర్తి చేయాలి.

హైపోథెకేషన్‌ను ఎలా తొలగించాలి..?

RTO రికార్డుల నుంచి బ్యాంక్ పేరును తీసివేయడానికి ముందుగా parivahan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. తర్వాత హోమ్‌పేజీలోని ఆన్‌లైన్ సర్వీస్ ఆప్షన్‌లో వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఇందులో స్టేట్‌ ఆప్షన్‌ ఎంచుకోవడం వల్ల ఆన్‌లైన్‌లో పొందే సేవల జాబితా కనిపిస్తుంది. ఈ పోర్టల్‌లో మొదట మొబైల్ నంబర్-ఇమెయిల్ IDని ఎంటర్‌ చేసి అకౌంట్‌ని క్రియేట్‌ చేయాలి. యాక్టివేషన్ లింక్ OTPతో ఇ మెయిల్‌లో వస్తుంది.

ఈ యాక్టివేషన్ లింక్‌పై క్లిక్ చేసి యూజర్ ఐడిని యాక్టివేట్ చేసి ఆపై పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి. యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అయిన తర్వాత సర్వీస్‌కి వెళ్లి హైపోథెకేషన్ టెర్మినేషన్ ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి. తర్వాత రసీదు ప్రింటవుట్ తీసుకోవాలి. ఫీజు చెల్లించిన తర్వాత చెల్లించిన పేజీ ప్రింట్ అవుట్, RC, ఇన్సూరెన్స్‌, బ్యాంక్ NOC, పొల్యూషన్ సర్టిఫికేట్‌ను RTOకి పంపాలి. ఈ పత్రాలను స్వీకరించిన తర్వాత RTO 10 నుంచి 15 రోజులలో రికార్డుల నుంచి బ్యాంకు పేరు తీసివేస్తుంది. తర్వాత కొత్త RCని జారీ చేస్తుంది. ఇది పోస్ట్ ద్వారా ఇంటికి వస్తుంది.

హైపోథెకేషన్‌ తొలగించకుంటే ఏం జరుగుతుంది..?

హైపోథెకేషన్‌ తొలగించకుంటే కారు అమ్మేటప్పుడు పలు సమస్యలు ఎదురవుతాయి. RTO నుంచి హైపోథెకేషన్‌ను తొలగించే వరకు కారు రిజిస్ట్రేషన్ బదిలీ జరగదు. మరొకటి బ్యాంక్ నుంచి తీసుకున్న NOC ఇష్యూ చేసిన తేదీ నుంచి మూడు నెలల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ మూడు నెలల్లో మీరు RTO నుంచి బ్యాంక్ పేరును తీసివేయాలి. లేదంటే మళ్లీ బ్యాంక్‌కి వెళ్లి మళ్లీ రుసుము చెల్లించి NOC కాపీని తీసుకోవాలి. దీనివల్ల సమయం, డబ్బు రెండు వృథా అవుతాయని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories