Amazon Top Smartphone Deals: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. ఇవే టాప్-5 స్మార్ట్‌ఫోన్ డీల్స్..!

Amazon Top Smartphone Deals: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. ఇవే టాప్-5 స్మార్ట్‌ఫోన్ డీల్స్..!
x

Amazon Top Smartphone Deals: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. ఇవే టాప్-5 స్మార్ట్‌ఫోన్ డీల్స్..!

Highlights

Amazon Top Smartphone Deals: మే 1 నుండి పెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో సరికొత్త సేల్ ప్రారంభం కానున్నాయి, దీనిలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలపై పెద్ద తగ్గింపులను చూడచ్చు.

Amazon Top Smartphone Deals: మే 1 నుండి పెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో సరికొత్త సేల్ ప్రారంభం కానున్నాయి, దీనిలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలపై పెద్ద తగ్గింపులను చూడచ్చు. అదే సమయంలో, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఇప్పటికే కొన్ని టాప్ బ్రాండ్ మొబైల్ డీల్‌లను ఆవిష్కరించింది. వీటిని మీరు ఈ సేల్ సమయంలో చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15,ఐకూ నియో 10R, వన్‌ప్లస్ 13R కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లన్నింటిపై బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మీరు చాలా కాలంగా మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తుంటే, ఈ టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

iPhone 15

ఐఫోన్‌తో ప్రారంభిద్దాం.. మీరు యాపిల్ అభిమాని అయితే లేదా ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 15 పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్‌లో కేవలం రూ. 57,749 కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల డిస్‌ప్లే, యాపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్, 48MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy S24 Ultra 5G

జాబితాలోని రెండవ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G. ఇది అమెజాన్ సేల్ సమయంలో రూ.84,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మీరు HDFC క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మీరు ఒక ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, ఇది ఉత్తమ డీల్ కావచ్చు.

OnePlus 13R

ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన వన్‌ప్లస్ 13ఆర్ కూడా ఈ సేల్‌లో చాలా చౌకగా దొరుకుతుంది. ఈ సేల్ సమయంలో ఈ ఫోన్ రూ.39,999కి అమ్మకానికి ఉంటుంది. ఇది కాకుండా ఫోన్‌తో పాటు రూ.3,999 విలువైన వన్‌ప్లస్ బడ్స్ 3 ఉచితంగా లభిస్తాయి.

Samsung Galaxy M35 5G

సామ్‌సంగ్ ఫోన్లలో అత్యధికంగా అమ్మడవుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ M35 5G కూడా ఈ సేల్‌లో డిస్కౌంట్‌తో లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను ఈ సేల్‌లో కేవలం రూ.13,999కే కొనుగోలు చేయచ్చు. ఈ మొబైల్ FHD+ రిజల్యూషన్ ,120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందిస్తుంది.

iQoo Neo 10R 5G

జాబితాలోని చివరి ఫోన్ ఐకూ నియో 10R 5G, ఇది పాకెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ పై మొత్తం రూ.4,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది, ఆ తర్వాత దీని ధర రూ.13,249 మాత్రమే అవుతుంది. ఈ ఫోన్‌లో 6,400mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories