Honda: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 3ఎస్ యూవీలను కొత్తేడాదిలో లాంచ్ చేస్తున్న హోండా..!

After New Amaze Launch Honda Planning to Come With 3 Upcoming SUVs in India
x

Honda: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 3ఎస్ యూవీలను కొత్తేడాదిలో లాంచ్ చేస్తున్న హోండా..!

Highlights

Honda: జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా తన కొత్త హోండా అమేజ్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

Honda: జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా తన కొత్త హోండా అమేజ్‌ను భారతదేశంలో విడుదల చేసింది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో తన బలమైన ఉనికిని నెలకొల్పడంతో పాటు, హోండా ఇప్పుడు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎస్ యూవీ సెగ్మెంట్‌పై దృష్టి సారిస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు ఎస్‌యూవీ కార్లను విడుదల చేయడంపై కంపెనీ దృష్టి సారించింది. ప్రస్తుతం, ఎస్ యూవీ సెగ్మెంట్లో భారత మార్కెట్లో ఒకే ఒక హోండా కారు ‘ఎలివేట్’ మాత్రమే ఉంది. హోండా కార్స్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి భారత మార్కెట్లోకి మూడు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇంతకుముందు, కంపెనీ ఎస్ యూవీ మోడల్స్ WR-V, CR-V వంటివి భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. తర్వాత కంపెనీ వాటి ఉత్పత్తిని నిలిపివేసింది.

మార్కెట్లో ప్రకంపనలు

జపనీస్ కార్ కంపెనీ హోండా మోటార్స్ యొక్క భారతీయ అనుబంధ సంస్థ అయిన హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ సిఇఒ టకుయా సుమురా..భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎస్ యూవీ మార్కెట్లో తమ ఉనికిని పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీకి చెందిన ఎస్‌యూవీ మోడల్ 'ఎలివేట్' మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది కాకుండా, కంపెనీ భారతదేశంలో అమేజ్, సిటీ అనే మరో రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి ఎస్ యూవీ విభాగంలో 3 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికపై కంపెనీ పని చేస్తోందని టకుయా సుమురా తెలిపింది. కొత్త మోడల్స్‌లో హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్ ఆప్షన్‌లు ఉంటాయి.

దేశంలో విక్రయించబడుతున్న కార్లలో 50శాతం ఎస్ యూవీ

స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) సెగ్మెంట్ వాహనాలు ఇప్పుడు భారత మార్కెట్లో అమ్ముడవుతున్న మొత్తం 40 లక్షల ప్యాసింజర్ వాహనాల్లో దాదాపు 50 శాతం ఉన్నాయని ఆయన చెప్పారు. హోండా భారత మార్కెట్ కోసం కొత్త ఎస్ యూవీ మోడళ్లను అభివృద్ధి చేయడానికి, విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది.

కొత్త హోండా అమేజ్ లాంచ్

హోండా కార్స్ ఇండియా తన కాంపాక్ట్ సెడాన్ కారు అమేజ్ మూడో తరం మోడల్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 10.89 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంచింది. కంపెనీ దీనిని మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడ్‌లలో విడుదల చేసింది. మార్కెట్‌లో దీని పోటీ మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్‌లతో ఉంటుంది. కంపెనీ కొత్త అమేజ్‌లో ADAS సూట్‌ను అందించింది. దీంతో ఇప్పుడు భారతదేశంలోని ప్రతి హోండా కారులో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. హోండా అమేజ్ మొదటిసారిగా 2013 సంవత్సరంలో విడుదల చేయగా, దాని రెండవ తరం 2018లో ప్రారంభించబడింది. కంపెనీ ఇప్పటి వరకు 5.8 లక్షల యూనిట్లను విక్రయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories