Stuck In The Car: అనుకోకుండా కారులో ఇరుక్కుపోయారా.. టెన్షన్‌ పడకుండా ఇలా చేయండి..!

Accidentally Stuck In A Car Break The Glass Like This Without Getting Tensed
x

Stuck In The Car: అనుకోకుండా కారులో ఇరుక్కుపోయారా.. టెన్షన్‌ పడకుండా ఇలా చేయండి..!

Highlights

Stuck In The Car: కొన్ని సందర్భాలలో అనుకోకుండా కారులో ఇరుక్కుపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కారు డోర్స్‌ లాక్‌ అయిన సందర్భంలో లేదా ఎవరైనా మిమ్మల్ని ప్రమాదంలో పడేయాడానికి ఇలా చేయవచ్చు.

Stuck In The Car: కొన్ని సందర్భాలలో అనుకోకుండా కారులో ఇరుక్కుపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కారు డోర్స్‌ లాక్‌ అయిన సందర్భంలో లేదా ఎవరైనా మిమ్మల్ని ప్రమాదంలో పడేయాడానికి ఇలా చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కారు నుంచి బయటకు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఉన్న ఏకైక మార్గం కారు గ్లాసు పగలగొట్టడమే. కానీ ఇది అంత సులువైన పనికాదు. కానీ సాధ్యమవుతుంది. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.

కారులో ఉండి కారు గ్లాసు పగలగొట్టాలంటే సైడ్ విండో గ్లాస్ ను పగలగొట్టవచ్చు. వాస్తవానికి సైడ్ విండో గ్లాస్ విండ్‌షీల్డ్ కంటే సన్నగా, బలహీనంగా ఉంటుంది. దీని కారణంగా సులభంగా పగులుతుంది. అంతేకాకుండా ఇది విండ్‌షీల్డ్ కంటే చౌకగా ఉంటుంది. మీరు కొత్త విండో గ్లాస్‌ను పగలగొట్టిన తర్వాత మళ్లీ అమర్చడానికి ఖర్చు కూడా తక్కువవుతుంది. అయితే కారులో మీకు గ్లాసు పగలగొట్టడానికి సుత్తిలాంటి పరికరం ఎలాంటిది ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటగా మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. భయంతో గాజును పగలగొట్టడానికి ప్రయత్నిస్తే గాయపడటం తప్పించి ఎలాంటి ఫలితం ఉండదు.

ఈ పరిస్థితిలో సీటు హెడ్‌రెస్ట్‌లు మీకు బాగా ఉపయోగపడతాయి. సీటు నుంచి వాటిని తీసి మెటల్ భాగాన్ని విండో అంచు దగ్గర ఉంచి బలంగా కొట్టాలి. ఒక్కసారి చేస్తే గ్లాసు పగలకపోవచ్చు. కానీ పదే పదే ట్రై చేస్తే గాజు పగిలిపోతుంది. ఇది కాకుండా సీట్ బెల్ట్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు విండోను పగలగొట్టడానికి సీట్‌బెల్ట్ మెటల్ భాగాన్ని ఉపయోగించవచ్చు. ఇది విండో అంచున ఉంచి బలంగా కొడుతూ ఉండటం వల్ల కొద్దిసేపటికి పగిలే అవకాశాలు ఉంటాయి. కానీ దీనికి చాలా సమయం పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories