Upcoming Hybrid Cars From Maruti: మార్కెట్‌ను షేక్ చేసేందుకు మారుతి ప్లాన్.. త్వరలో మూడు హైబ్రిడ్ కార్లు లాంచ్..!

Upcoming Hybrid Cars From Maruti
x

Upcoming Hybrid Cars From Maruti: మార్కెట్‌ను షేక్ చేసేందుకు మారుతి ప్లాన్.. త్వరలో మూడు హైబ్రిడ్ కార్లు లాంచ్..!

Highlights

Upcoming Hybrid Cars From Maruti: మారుతి సుజుకి దేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు హైబ్రిడ్ కార్లను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హైబ్రిడ్ కార్ల ప్రత్యేకత ఏమిటంటే, వాటికి చిన్న బ్యాటరీ ఉంటుంది.

Upcoming Hybrid Cars From Maruti: మారుతి సుజుకి దేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు హైబ్రిడ్ కార్లను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హైబ్రిడ్ కార్ల ప్రత్యేకత ఏమిటంటే, వాటికి చిన్న బ్యాటరీ ఉంటుంది. వాహనం ఇంధనంతో పాటు బ్యాటరీతో నడుస్తుంది, దీని కారణంగా మైలేజ్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడానికి బడ్జెట్ లేని వారికి హైబ్రిడ్ మంచి ఎంపిక. మారుతి సుజుకి ఇప్పుడు దేశంలో తన మూడు హైబ్రిడ్ కార్లను విడుదల చేయబోతోంది.

Maruti Suzuki Fronx Hybrid

మారుతి సుజుకి తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్‌ను దేశంలో విడుదల చేయబోతోంది. ఈ కారు ఈసారి దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ ఏడాది మే-జూన్‌లో దీన్ని ప్రారంభించచ్చు. నివేదికల ప్రకారం, ఈ కారు ఒక లీటర్‌లో 35 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించగలదు. ఇందులో 1.5-2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

Maruti Baleno Hybrid

ఈ సంవత్సరం మారుతి సుజుకి తన తదుపరి హైబ్రిడ్ కారు బాలెనోను కూడా తీసుకువస్తోంది. ఈ కారు 1.2L Z12E పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇందులో 1.5-2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. బాలెనో హైబ్రిడ్ కూడా లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు. ఈ ఏడాది చివరి నాటికి ఈ కారును మార్కెట్లోకి విడుదల చేయచ్చు. బాలెనో హైబ్రిడ్ ధర రూ. 10 లక్షల లోపు ఉండచ్చు.

Maruti New Compact MPV

మారుతి సుజుకి ఈ ఏడాదిలోనే కొత్త కాంపాక్ట్ ఎంపివి స్పేసియాను భారత్‌లో ప్రవేశపెట్టవచ్చు. ఈ మోడల్ ఇప్పటికే జపాన్‌లో అందుబాటులో ఉంది. ఇది హైబ్రిడ్ ఇంజన్‌ దేశంలోకి రానుంది. ప్రస్తుతానికి ఈ వాహనం గురించి తదుపరి సమాచారం అందలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories