Kawasaki: రైడర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లలో కవాసకి వెర్సిస్ 650 వచ్చేస్తోంది

Kawasaki
x

Kawasaki: రైడర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లలో కవాసకి వెర్సిస్ 650 వచ్చేస్తోంది

Highlights

Kawasaki: లాంగ్ డ్రైవ్‌లు ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. కవాసకి తమ అత్యంత ప్రజాదరణ పొందిన మిడిల్‌వెయిట్ స్పోర్ట్-టూరర్ 2026 వెర్సిస్ 650ను యూరోపియన్ మార్కెట్‌లో అధికారికంగా ఆవిష్కరించింది.

Kawasaki: లాంగ్ డ్రైవ్‌లు ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. కవాసకి తమ అత్యంత ప్రజాదరణ పొందిన మిడిల్‌వెయిట్ స్పోర్ట్-టూరర్ 2026 వెర్సిస్ 650ను యూరోపియన్ మార్కెట్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. సుదూర ప్రయాణాలు చేయాలనుకునే రైడర్లకు 2026 కవాసకి వెర్సిస్ 650 ఒక అద్భుతమైన ఆప్షన్. దీని మెకానికల్ స్పెసిఫికేషన్స్‌లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, కొత్త మోడల్‌లో కొత్త రంగులు, బెస్ట్ టెక్నాలజీ వాడారు. కవాసకి ఈ ఏడాది చివరి నాటికి 2026 వెర్సిస్ 650ని భారత మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ధరల గురించి అధికారికంగా వెల్లడించనప్పటికీ, ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కొద్దిగా ధర పెరిగే అవకాశం ఉంది. 2026 మోడల్‌కు, కవాసకి వెర్సిస్ 650 కేవలం లుక్స్ పరంగా మాత్రమే అప్‌డేట్ చేసింది. ఈ బైక్ ఇప్పుడు మూడు కొత్త రంగులలో లభిస్తుంది. నీలం, ఎరుపు, బ్రాండ్ స్పెషల్ గ్రీన్. దీని డిజైన్ పెద్ద వెర్సిస్ 1100 నుండి ఇన్స్పైర్ పొందింది. ఇందులో ట్విన్-LED హెడ్‌లైట్లు, స్ట్రాంగ్ బీక్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్ ఉన్నాయి.

వెర్సిస్ 650 బైక్ 649 సీసీ, లిక్విడ్-కూల్డ్, ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 66 బీహెచ్‌పీ పవర్‌ను, 61 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది స్ట్రాంగ్ మిడ్-రేంజ్ పెర్ఫార్మెన్స్‌ను, అద్భుతమైన టూరింగ్ రిఫైన్‌మెంట్‌ను అందిస్తుంది. ఛాసిస్‌లో స్టీల్ ఫ్రేమ్, USD ఫ్రంట్ ఫోర్క్, రియర్ మోనోషాక్ ఉన్నాయి. ఇవి హైవేలు, సాధారణ రోడ్లు, రెండింటిలోనూ మంచి రైడింగ్ ఎక్సపీరియన్స్ అందిస్తాయి.

ఈ బైక్‌లో రైడర్‌లకు ఎంతో నచ్చే 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా లభిస్తుంది. ఈ సిస్టమ్ వాయిస్ కమాండ్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. అంతేకాకుండా, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, మెరుగైన సీటు, గాలిని అడ్డుకొని, అలసటను తగ్గించడానికి రూపొందించిన అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు టూరింగ్ ప్రియుల అవసరాలను తీరుస్తాయి. ఈ బైక్ టూరర్, టూరర్ ప్లస్, గ్రాండ్-టూరర్ ఎడిషన్లలో కూడా లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories