2025 Honda Dio 125 Launched: కొత్త రంగులు, ఫీచర్లు.. సరికొత్త డియో 125 లాంచ్.. ధర ఎంతంటే.. ?

2025 Honda Dio 125 Launched
x

2025 Honda Dio 125 Launched: కొత్త రంగులు, ఫీచర్లు.. సరికొత్త డియో 125 లాంచ్.. ధర ఎంతంటే.. ?

Highlights

2025 Honda Dio 125 Launched: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భారతదేశంలో కొత్త 2025 డియో 125ను విడుదల చేసింది.

2025 Honda Dio 125 Launched: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భారతదేశంలో కొత్త 2025 డియో 125ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,749. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. అప్‌డేటెడ్ డియో 125 అద్భుతమైన డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో ,మెరుగైన సామర్థ్యంతో వస్తుంది, ఇది స్పోర్టి,స్టైలిష్ మోటో-స్కూటర్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది. హోండా డియో ప్రసిద్ధ డిజైన్ సిల్హౌట్‌ను నిలుపుకుంది. కొత్త గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్స్‌తో దానిని రిఫ్రెష్ చేసింది.

హోండా డియో 125 ను DLX, H-స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. DLX ధర రూ.96,749 (ఎక్స్-షోరూమ్). H-స్మార్ట్ ధర రూ.1,02,144. కొత్త డియో 125 ఇప్పుడు OBD2B-కంప్లైంట్. ఇందులో 123.92సీసీ, సింగిల్-సిలిండర్, PGM-Fi ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 6.11 kW, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌ను కూడా ఉంది. మీరు దీన్ని మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ స్పోర్ట్స్ ఎల్లో, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ అనే 5 రంగుల ఎంపికలలో కొనుగోలు చేయచ్చు.

ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఇందులో కొత్త 4.2-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది.మైలేజ్, ట్రిప్ మీటర్, రేంజ్, వెధర్ ఇంటికేటర్ వంటి రియల్ టైమ్ డేటాను చూపుతుంది. కొత్త మోడల్ హోండా రోడ్‌సింక్ యాప్‌తో కూడా అనుకూలంగా ఉంటుంది, ఇది కాల్/మెసేజ్ అలర్ట్‌లు, నావిగేషన్‌‌లను చూపిస్తుంది. ఇందులో స్మార్ట్ కీ, USB టైప్-C ఛార్జర్,ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సిఈఓ అయిన సుట్సుము ఒటాని మాట్లాడుతూ.. 21 సంవత్సరాలకు పైగా, డియో భారతీయ మార్కెట్లో ఒక ఐకానిక్ పేరుగా నిలిచిందని, నమ్మకానికి ప్రతీక అని అన్నారు. ట్రెండీ, నమ్మకమైన మోటో-స్కూటర్ కోసం చూస్తున్న కస్టమర్లకు ఇది ఎల్లప్పుడూ మొదటి ఎంపిక. కొత్త OBD2B డియో 125 విడుదలతో మేము మా కస్టమర్లకు అదనపు విలువ, ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాము, అదే సమయంలో మోటో-స్కూటర్ ప్రధాన భావనను నిలుపుకుంటున్నాము.

Show Full Article
Print Article
Next Story
More Stories