2025 Hero Super Splendor XTEC Launched: లెజెండరీ బైక్ కొత్తగా వచ్చేసింది.. అప్‌డేట్ ఫీచర్స్‌తో హీరో ఎక్స్‌టెక్.. మైలేజ్ ఎంతో తెలుసా..?

2025 Hero Super Splendor XTEC OBD-2B Launched at Price RS 88128
x

2025 Hero Super Splendor XTEC Launched: లెజెండరీ బైక్ కొత్తగా వచ్చేసింది.. అప్‌డేట్ ఫీచర్స్‌తో హీరో ఎక్స్‌టెక్.. మైలేజ్ ఎంతో తెలుసా..?

Highlights

2025 Hero Super Splendor XTEC Launched: హీరో మోటోకార్ప్ ఇప్పుడు తన 125సీసీ సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్‌ను అప్‌డేట్ చేసింది.

2025 Hero Super Splendor XTEC Launched: హీరో మోటోకార్ప్ ఇప్పుడు తన 125సీసీ సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్‌ను అప్‌డేట్ చేసింది. ఈ బైక్ ఇంజిన్ OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ అయింది. దీనివల్ల బైక్ మెరుగైన మైలేజ్, పనితీరు, కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్‌లో కంపెనీ కొత్త గ్రాఫిక్స్‌ను అందించింది, ఇవి దాని ఇంధన ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లపై కనిపిస్తాయి. అంతే కాకుండా, ఈ బైక్‌లో ఇతర మార్పులు ఏవీ చేయలేదు. పరిమాణంలో కూడా ఎటువంటి మార్పు చేయలేదు. దీని పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

2025 Hero Super Splendor XTEC Engine

హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 125సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 10.7బిహెచ్‌పి పవర్, 10.6ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ అప్‌డేట్ చేసిన OBD-2B ఉద్గారాలు, ఫ్యూయల్-ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఇంజిన్ మెరుగ్గా పనిచేయడంతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ బైక్ లీటరుకు 69 కిమీ మైలేజీని అందిస్తుందని హీరో పేర్కొంది. ధర గురించి మాట్లాడుకుంటే, సూపర్ స్ప్లెండర్ XTEC ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,128 నుండి ప్రారంభమవుతుంది.

సూపర్ స్ప్లెండర్ XTECకి నిజమైన పోటీ హోండా షైన్ 125 నుండి ఉంటుంది. షైన్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్. ఈ బైక్ ఇంజిన్,దాని సౌకర్యవంతమైన ప్రయాణం కస్టమర్లకు ప్రధాన ప్లస్ పాయింట్లు. ఈ బైక్‌లో 124 సీసీ 4 స్ట్రోక్, SI ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, సున్నితమైన ప్రయాణం కోసం 5 స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు.

ఈ బైక్ ఒక లీటరు పెట్రోల్‌తో 64 కి.మీ (ARAI) మైలేజీని ఇవ్వగలదు. మెరుగైన బ్రేకింగ్ కోసం, ఈ బైక్ ముందు భాగంలో 240మిమీ డిస్క్, వెనుక భాగంలో 130మిమీ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్‌కు 18 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ధర గురించి మాట్లాడుకుంటే, దాని డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 83251 కాగా, డిస్క్ మోడల్ ధర రూ. 87251.

Show Full Article
Print Article
Next Story
More Stories