2025 Citroen C3 Updated: సిట్రోయెన్ సీ3లో కొత్త ఫీచర్స్.. అమేజింగ్‌గా ఉంది.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!

2025 Citroen C3 Updated
x

2025 Citroen C3 Updated: సిట్రోయెన్ సీ3లో కొత్త ఫీచర్స్.. అమేజింగ్‌గా ఉంది.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!

Highlights

2025 Citroen C3 Updated: సిట్రోయెన్ ఇండియా 2025 మోడల్ సంవత్సరానికి C3 హ్యాచ్‌బ్యాక్‌ను అప్‌డేట్ చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు కొత్త అవతార్‌లో రెండు కొత్త ఫీచర్లతో వస్తుంది. సిట్రోయెన్ C3 బాడీలో ఎటువంటి మార్పులు లేవు.

2025 Citroen C3 Updated: సిట్రోయెన్ ఇండియా 2025 మోడల్ సంవత్సరానికి C3 హ్యాచ్‌బ్యాక్‌ను అప్‌డేట్ చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు కొత్త అవతార్‌లో రెండు కొత్త ఫీచర్లతో వస్తుంది. సిట్రోయెన్ C3 బాడీలో ఎటువంటి మార్పులు లేవు. అదే డిజైన్, లుక్‌లో కనిపిస్తుంది. C3 ధర రూ. 6.23 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కొత్తగా విడుదలైన టాప్-స్పెక్ డార్క్ ఎడిషన్ కోసం రూ. 10.19 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

2025 Citroen C3 Changes

కొత్త సిట్రోయెన్ C3 ఇప్పుడు మిడ్, టాప్ వేరియంట్‌లలో అడ్జస్ట్ చేయగల హెడ్‌రెస్ట్‌లతో వచ్చింది. అయితే బేస్, మిడ్ ట్రిమ్‌ల మధ్య కొత్త వేరియంట్ ఉంచారు. కొత్త ఫీల్ వేరియంట్ ఎంట్రీ-లెవల్ లైవ్, ఫీల్ (O) ట్రిమ్‌ల మధ్యలో అందించారు. ఇది రిమోట్ కీలెస్ ఎంట్రీ, రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, రూఫ్ రైల్స్, స్పేర్ వీల్, వానిటీ మిర్రర్‌తో కూడిన ప్యాసింజర్ సన్ వైజర్ వంటి ఫీచర్లను చేర్చింది.

సిట్రోయెన్ C3 మిడ్, టాప్ వేరియంట్‌లలో E20 కంప్లైంట్ 45-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌ ఉంది. మరో పెద్ద మార్పు ఏమిటంటే, మోడల్‌లోని పాత 30-లీటర్ ఇంధన ట్యాంక్ స్థానంలో సిట్రోయెన్ C3లో పెద్ద 45-లీటర్ ఇంధన ట్యాంక్‌ను అందించడం. ఇంజిన్ ఇప్పుడు E20-కంప్లైంట్‌గా ఉండటం వల్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఏర్పడింది. ఇంకా, 2025 C3 ఫీల్ (O) వేరియంట్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌లపై టర్న్ ఇండికేటర్‌లను, ముందు సీటు అడ్జస్ట్ చేయగల హెడ్‌రెస్ట్‌లను ప్యాక్ చేస్తుంది.

2025 Citroen C3 Specifications

2025 సిట్రోయెన్ C3లో ఎటువంటి మెకానికల్ మార్పులు లేవు. హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. మొదటి ఇంజిన్ 81 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. మరో టర్బో పెట్రోల్ ఇంజిన్ 108 బిహెచ్‌పి పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. సిట్రోయెన్ మాన్యువల్ వేరియంట్‌‌ 19.3 kmpl, ఆటోమేటిక్ వేరియంట్ 18.3 kmpl మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

Citroen C3 Dark Edition

సిట్రోయెన్ ఇండియా ఇటీవల కొత్త C3 డార్క్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది, ఇది మొదటిసారిగా బ్లాక్ పెయింట్ స్కీమ్‌ను హ్యాచ్‌కి తీసుకువస్తుంది. కొత్త C3 డార్క్ ఎడిషన్ ఎయిర్‌క్రాస్, బసాల్ట్ డార్క్ ఎడిషన్‌లతో పాటు అందుబాటులో ఉంది. మూడు మోడళ్లకు కొత్త పెర్లా నెరా బ్లాక్ షేడ్, చెవ్రాన్ లోగో, బ్రాండ్ లెటరింగ్‌పై డార్క్ క్రోమ్ యాక్సెంట్స్, అలాగే ముందు డోర్స్‌పై 'డార్క్ ఎడిషన్' బ్యాడ్జ్ ఉన్నాయి.

క్యాబిన్‌లో కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్‌తో బ్లాక్ లెథరెట్ సీట్లు, సీట్‌బెల్ట్ కుషన్లు, డాష్‌బోర్డ్ , డోర్ ప్యాడ్‌లపై సాఫ్ట్-టచ్ లెథరెట్, అలాగే యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ ఫుట్‌వెల్, డోర్ సిల్స్ ఉన్నాయి. గేర్ లివర్ బెజెల్ పై గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్‌తో పాటు ప్లాస్టిక్స్ కూడా బ్లాక్ కలర్‌లో డిజైన్ చేసింది. డార్క్ ఎడిషన్ ధర రూ. 8.38 లక్షల నుండి ప్రారంభమై, 10.19 లక్షల వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories