2025 Bajaj Dominar 400: ఇక పల్సర్ గురించి మర్చిపోండి.. దుమ్ము రేపే బజాజ్ 400సీసీ బైక్‌ వచ్చేస్తుంది..!

2025 Bajaj Dominar 400: ఇక పల్సర్ గురించి మర్చిపోండి.. దుమ్ము రేపే బజాజ్ 400సీసీ బైక్‌ వచ్చేస్తుంది..!
x

2025 Bajaj Dominar 400: ఇక పల్సర్ గురించి మర్చిపోండి.. దుమ్ము రేపే బజాజ్ 400సీసీ బైక్‌ వచ్చేస్తుంది..!

Highlights

2025 Bajaj Dominar 400: బజాజ్ కంపెనీకి చెందిన బైక్స్‌లో బాగా విజయవంతమైన మోటార్ సైకిళ్లు ఉన్నాయి. వాటిలో డొమినార్ సిరీస్ ముందు వరుసలో ఉంటుంది. ఈ బైక్‌లు అతిపెద్ద ఇంజిన్, మంచి పికప్, మెరుగైన మైలేజితో బైక్ ప్రియులను ఆకర్షిస్తుంటాయి. మరి ఇప్పుడు తర్వాతి తరం బజాజ్ 2025 డోమినార్ 400 రాబోతుంది. 373.3 సీసీ ఇంజిన్ కలిగిన ఈ మోటార్ సైకిల్ భారత విపణిలో విడుదల చేసేందుకు బజాజ్ ఆటో సంస్థ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. .

ఈ ఏడాది ప్రారంభంలో బజాజ్ కొత్త 2025 డొమినార్ 400 కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. మొదటిసారిగా కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ డొమినార్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ బైకులు డీలర్ల వద్దుకు కూడా చేరుకుంటున్నాయి. ఇందులో చాలా కొత్త అప్‌డేట్‌లు కూడా కనిపిస్తున్నాయి. పవర్ క్రూయిజర్‌గా, బజాజ్ డొమినార్ 400 మోటార్‌సైకిల్ ప్రజలకు గొప్ప ఎంపికగా మారుతుంది.

2025 Bajaj Dominar 400 Specifications

2025 మోడల్‌తో కూడా, డొమినార్ 400 టూరింగ్ యాక్సెసరీలను ప్రామాణికంగా ఒకే వేరియంట్‌లో అందిస్తుంది. ఇందులో ఫంక్షనల్ విండ్‌స్క్రీన్, నకిల్ గార్డ్‌లు, వెనుక లగేజ్ రాక్, పిలియన్ బ్యాక్‌రెస్ట్‌లను పొందుతుంది. ఈ మోటార్ సైకిల్ టూరింగ్ సామర్థ్యాలలో ఎటువంటి మార్పు లేదు.

ఈ బైక్‌లో మార్పులు కనిపించే విభాగం ఇన్‌స్ట్రుమెంటేషన్. బజాజ్ మెరుగైన పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందిస్తోంది. ఇది పల్సర్ NS400Z తో తొలిసారిగా వచ్చిన యూనిట్, ఇది డొమినార్ 400 లో ఉన్న ఇంజిన్‌నే కలిగి ఉంది. ఈ కొత్త క్లస్టర్‌తో డొమినార్ ఇప్పుడు మొదటిసారిగా బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.

దాని ఇంధన ట్యాంక్‌లోని రెండవ టెల్-టేల్ క్లస్టర్‌ను పూర్తిగా తొలగిస్తారు. ఇప్పుడు దాని స్థానంలో USB ఛార్జర్‌ను అందిస్తారు. ఈ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ కంట్రోల్ కోసం బజాజ్ స్విచ్‌గేర్‌ను అప్‌డేట్ చేశారు, ఇది పల్సర్ NS400Z లో కనిపిస్తుంది. ఈ క్లస్టర్‌ను నియంత్రించడానికి ఎడమ స్విచ్ గేర్‌పై ఒక D-ప్యాడ్ ఉంది.

2025 Bajaj Dominar 400 Engine

2025 బజాజ్ డొమినార్ 400 పల్సర్ NS400Z మాదిరిగానే రైడ్-బై-వైర్, ABS మోడ్‌లతో వస్తుంది. కొత్త, మరింత కఠినమైన BS6 P2 OBD2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌లో కొన్ని మార్పులను మనం ఆశించవచ్చు. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2025 తర్వాత తయారైన వాహనాలకు వర్తిస్తాయి. కొత్త ఉద్గార నిబంధనలను పాటించడంతో పాటు, డొమినార్ 400 పనితీరులో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ 373.3సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది దాదాపు 39 బిహెచ్‌పి పవర్, 35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories