Kia Carens Clavis: ఇన్నోవా, ఎర్టిగా కస్టమర్లకు ఎర..11.49 లక్షలకే 7 సీటర్ కారు

Kia Carens Clavis
x

Kia Carens Clavis: ఇన్నోవా, ఎర్టిగా కస్టమర్లకు ఎర..11.49 లక్షలకే 7 సీటర్ కారు

Highlights

Kia Carens Clavis: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కియా ఇండియా విడుదల చేసిన ఒక 7 సీటర్ కారు ఇప్పుడు 'గేమ్‌చేంజర్'గా మారింది.

Kia Carens Clavis: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కియా ఇండియా విడుదల చేసిన ఒక 7 సీటర్ కారు ఇప్పుడు 'గేమ్‌చేంజర్'గా మారింది. అది మరెదో కాదు.. ఇటీవల లాంచ్ అయిన కియా కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis). ఈ కారు కియాకు అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెడుతోంది. దీని ప్రభావంతో మే నెలలో కియా మోటార్స్ విక్రయాలు ఏకంగా 14.43 శాతం పెరిగాయి. మే 2025లో కంపెనీ మొత్తం 22,315 వాహనాలను విక్రయించింది. ఇది మే 2024తో పోలిస్తే గణనీయమైన వృద్ధి. కియా కారెన్స్ క్లావిస్‌కు అద్భుతమైన స్పందన లభించిందని కంపెనీ స్వయంగా వెల్లడించింది. ఈ ఎంపీవీ రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది.

జూలైలో ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కియా తదుపరి ఉత్పత్తి జూలైలో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. అదే కియా కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ వెర్షన్. ఇది భారతదేశంలో కియా తయారు చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ కారు కానుంది. రాబోయే కారు డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందని, కియా డిజైన్ లేటెస్ట్ టెక్నాలజీని మిళితం చేసి దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. భారతీయ వినియోగదారుల ఆశలను తీర్చడానికి దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు పేర్కొంది.

ఎలక్ట్రిక్ కారు డిజైన్, మార్పులు

రాబోయే కియా కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ మోడల్ డిజైన్, దాని పెట్రోల్-డీజిల్ మోడల్ లాగానే ఉంటుంది. అయితే, ఇది ఎలక్ట్రిక్ కారు కాబట్టి కొన్ని మార్పులు తప్పనిసరిగా ఉంటాయి. ఎలక్ట్రిక్ కారు కావడంతో ఇందులో కియా EV9 లాంటి క్లోజ్డ్ గ్రిల్ ఉంటుంది. అంతేకాకుండా, దీనికి కొత్త డిజైన్ చేసిన ముందు, వెనుక బంపర్‌లు, అలాగే కొత్త డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ ఉంటాయి. దీనికి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, కొత్త సస్పెన్షన్ సెటప్ కూడా ఉండవచ్చు.

అద్భుతమైన ఫీచర్లు, బ్యాటరీ వివరాలు

కియా కారెన్స్ ఈవీలో అనేక లేటెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు అనుసంధానించబడి ఉంటుందని అంచనా. ఇతర ఫీచర్లలో ఎయిర్ ప్యూరిఫైయర్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటివి ఉంటాయి. రాబోయే కియా క్యారెన్స్ EV, హ్యుందాయ్ క్రెటా EV మాదిరిగానే రేంజ్ పవర్ కలిగి ఉండవచ్చు. ఇందులో 45 kWh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. క్యారెన్స్ EVకి ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ లభించే అవకాశం ఉంది. కియా ఇప్పటివరకు EV గురించి ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. అయితే, కారెన్స్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే మంచి రేంజ్ ఇస్తుందని ఆశిస్తున్నారు. ఇది ఇన్నోవా, ఎర్టిగా వంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories