Zodiac Signs: 2026 గ్రహ సంచారం.. శని, గురుల అనుగ్రహం.. ఈ 3 రాశులకు తిరుగులేని అదృష్టం!

Zodiac Signs
x

Zodiac Signs: 2026 గ్రహ సంచారం.. శని, గురుల అనుగ్రహం.. ఈ 3 రాశులకు తిరుగులేని అదృష్టం!

Highlights

Zodiac Signs: ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026లో బృహస్పతి (గురు) మరియు శని గ్రహాల ప్రత్యేక కలయిక కొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెట్టనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Zodiac Signs: మరికొన్ని రోజుల్లో 2025 ముగిసి 2026 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న వేళ చాలా మంది తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026లో బృహస్పతి (గురు) మరియు శని గ్రహాల ప్రత్యేక కలయిక కొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెట్టనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

బృహస్పతి సింహ రాశిలో, శని మీన రాశిలో సంచరిస్తుండటంతో ఒక ప్రత్యేక యోగం ఏర్పడనుందని, దీని వల్ల కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా కర్కాటకం, మిథునం, కుంభ రాశివారికి ఈ కాలం లాభదాయకంగా ఉంటుందని అంచనా.

కర్కాటకం

ఈ రాశివారికి శని–గురు స్థానం అనుకూలంగా ఉండటంతో అదృష్ట కాలం ప్రారంభమవుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేశీయ, విదేశీ ప్రయాణ యోగం ఉంది.

మిథునం

ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు, పదోన్నతులు సాధ్యమవుతాయి. వ్యాపారులకు ఆర్థిక లాభాలు ఉంటాయి. అయితే ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది.

కుంభం

కుంభ రాశివారికి సాడేసాత్ చివరి దశ నడుస్తుండటంతో శని మహారాజు అనుకూల ఫలితాలను ఇస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల సాధ్యమవుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

మొత్తంగా 2026లో శని–గురు కలయిక ఈ మూడు రాశుల వారికి కొత్త అవకాశాలు, విజయాలు, సంతోషకరమైన మార్పులు తీసుకురానుందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories