Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (మార్చి 9 - మార్చి 15)

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (మార్చి 9 - మార్చి 15)
x
Highlights

Weekly Horoscope in Telugu 2025 March 9 to March 15: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Weekly Horoscope in Telugu 2025 March 9 to March 15: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం

ఈవారం మిశ్రమ ఫలితాలను పొందుతారు. కీలక వ్యవహారం శుభప్రదంగా ముగుస్తుంది. శత్రుపీడ తగ్గుతుంది. బంధువులు సహకరిస్తారు. బలహీనతలను అధిగమించాల్సి ఉంటుంది. అపార్థాలు తొలగిపోతాయి. స్థిరాస్తి, మైనింగ్, విద్య, సేవల రంగాల్లోని వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మీ తెలివితేటలు, విశ్లేషణ శక్తికి గుర్తింపు ఉండదు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు తృప్తికరంగా సాగవు. గొడవలకు ఆస్కారముంది. అప్రమత్తంగా ఉండండి.

పరిహారం: శనైశ్చరుడిని పూజించండి. నల్ల నువ్వులను నివేదించండి. నలుపు కలిసిన వస్త్రాలను వాడండి.

వృషభం

ఒడుదుడుకులను తేలిగ్గానే అధిగమిస్తారు. కార్యనిర్వహణలో విశేష లాభముంటుంది. నాయకత్వ పటిమను చాటుతారు. సాహసోపేతమైన నిర్ణయాల వల్ల పైవారి దృష్టిలో పడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మీయులను కలుస్తారు. దాయాదులతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వారం మధ్యలో తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందుల్లో పడే సూచన ఉంది. మీ రహస్యాలు బయటపడే వీలుంది. ఆలోచనలను అదుపు చేయండి. కీలక నిర్ణయాల్లో తోబుట్టువులు, మిత్రులు సహకరిస్తారు. ఒత్తిడితగ్గుతుంది.

పరిహారం: లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. నారింజ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం

ఆత్మ విశ్వాసంతో కార్యాలను సాధిస్తారు. అన్ని రకాల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక అంశాల ద్వారా ప్రేరణను పొందుతారు. ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. ఎదుగుదలకు స్వశక్తే ఉపకరిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మాట తప్పితే అవమానం తప్పదు. బ్యాంకు లావాదేవీలు తృప్తినివ్వవు. వేళకు భోజనముండదు. ఇతరుల విషయాల్లో జోక్యం వల్ల ఇబ్బందులు వస్తాయి. విడాకుల వ్యవహారం కొలిక్కిరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది.

పరిహారం: శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించండి. ముదురు పుసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

యోగదాయకంగా ఉంటుంది. ధన సంబంధ వ్యవహారాల్లో మంచి లాభాలను పొందుతారు. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. కీలక సమాచారం అందుతుంది. సామాజిక అంశాలపై దృష్టి పెడతారు. గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారంలో సోదరులు తోడుగా నిలుస్తారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. విందులకు హాజరవుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. అవసరమైనప్పుడు అదృష్టం తోడుంటుంది. ఇతరుల వల్ల ఇబంది వచ్చే వీలుంది. జాగ్రత్త.

పరిహారం: శ్రీగాయత్రీ దేవిని పూజించండి. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

సింహం

ఆశించిన రీతిలో పనులను పూర్తి చేస్తారు. అవసరమైన చోట మీ మేథాశక్తితో లబ్దిని పొందుతారు. విందుకు హాజరవుతారు. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. బాల్యమిత్రులను కలుస్తారు. ఇంటికి దూరంగా ఒంటరిగా గడిపే సూచన ఉంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఆదాయానికి మించిన ఖర్చులు వేదనకు గురి చేస్తాయి. మిత్రులతోనూ సఖ్యత చెడుతుంది. పోటీలకు దిగకండి. కుటుంబంలో చికాకులు తలెత్తే సూచన ఉంది. రెండో పెళ్లి ప్రయత్నాలు అనుకూలించవు. ఆస్తి క్రయవిక్రయాలు పెద్దగా లాభించవు.

పరిహారం: నవగ్రహాలను దర్శించండి. లేత నీలం రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కన్య

పట్టింది బంగారంలా ఉంటుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధువులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించిన పకడ్బందీ ప్రణాళికలను రూపొందిస్తారు. ప్రయాణాలు మానండి. కన్ను లేదా పాదాల సమస్య ఉంటుంది.

పరిహారం: శ్రీకనకదుర్గ అమ్మవారిని పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

తుల

విజయోత్సాహాలతో గడుపుతారు. ఇష్టకార్యాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి మేలిమి ఫలితాలుంటాయి. బాధ్యతల నిర్వహణలో ప్రతిభ కనబరుస్తారు. తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ఉన్నత పదవిలోని వారు సహకరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతాన సంబంధ శుభకార్యాలపై చర్చలు సాగుతాయి. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు. వృథా ఖర్చులు తగ్గించండి.

పరిహారం: శ్రీసుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం

అత్యంత యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిపరమైన నైపుణ్యంతో మేలిమి అవకాశాలను పొందుతారు. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. దూర ప్రాంతాల్లో స్థిర నివాస యత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసం, స్థిరత్వం పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వినోదంగా గడుపుతారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

పరిహారం: శ్రీమహాగణపతిని పూజించండి. ముదురు ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

ధనుస్సు

మీ ప్రయత్నాలకు మిత్రుల సహకారం లభిస్తుంది. కార్యసాధనలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ఉద్యోగులకు పైఅధికారుల ప్రశంసలు అందుతాయి. ఇతరులతో విరోధం ఏర్పడినా విజయం మీకే దక్కుతుంది. ఎదుగుదలకు అందివచ్చే అవకాశాలను దుర్వినియోగం చేయకండి. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. చెప్పుడు మాటలను నమ్మి ఇబ్బంది పడతారు. తగాదాలకు ఆస్కారం ఉంది. పంతంతో పోటీలకు దిగకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. పుణ్య క్షేత్రాన్ని దర్శిస్తారు.

పరిహారం: ఈశ్వరుడి పూజ మేలు చేస్తుంది. ఊదా రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మకరం

అన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. ధనలాభం ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. నూతన విజ్ఞాన సముపార్జనకు అనువైన కాలమిది. నిజాయితీకి తగ్గ గుర్తింపును పొందుతారు. ప్రత్యర్థులపై పైచేయిని సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కొన్నిసార్లు ఇష్టంలేని పని చేయాల్సి వుంటుంది. కోపాన్ని అదుపు చేసుకోండి. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

పరిహారం: శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించండి. లేత నారింజ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కుంభం

అన్ని అడ్డంకులనూ తేలిగ్గా దాటేస్తారు. వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలను పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. కొత్త వస్తువులను కొంటారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. బంధువులతో విందులకు హాజరవుతారు. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ పరిస్థితులను చక్కబెడతారు. గృహనిర్మాణ యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతాన విషయాలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర పంతాలతో పోటీలకు దిగకండి.

పరిహారం: ఆంజనేయ స్వామిని పూజించండి. సిందూరపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మీనం

అన్ని వ్యవహారాల్లో శుభఫలితాలు లభిస్తాయి. అభీష్టం సిద్ధిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అపార్థాలు తొలగి గొడవలు సద్దుమణుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పోటీల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. విందులకు హాజరవుతారు. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కీర్తి పెరుగుతుంది. శారీరక, మానసిక సౌఖ్యం లభిస్తుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. వాత సమస్య ఉంటుంది.

పరిహారం: శ్రీదత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి వస్త్రాలను ధరించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories