Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (జనవరి 19 - జనవరి 25)

Weekly Horoscope
x

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (జనవరి 19 - జనవరి 25)

Highlights

Weekly Horoscope in Telugu, 2024 January 19 to January 25: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Weekly Horoscope in Telugu, 2024 January 19 to January 25: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం

చేపట్టిన కార్యాలు సఫలం అవుతాయి. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. బంధువులతో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. మనసు తేలికపడుతుంది. ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లోని వారికి తృప్తికర ఫలితాలుంటాయి. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. చెప్పుడు మాటలను నమ్మకండి. వృథా ఖర్చులను తగ్గించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

పరిహారం: శ్రీవేంకటేశ్వరుని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృషభం

చిక్కులు తొలగిపోతాయి. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో విశేష లాభాన్ని పొందుతారు. బలహీనతలను జయిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. విందుకు హాజరవుతారు. విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. నిపుణతకు తగ్గ గుర్తింపును పొందుతారు. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బద్ధకం వద్దు. సంతానం తీరు కాస్త ఇబ్బంది పెడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించవు.

పరిహారం: శ్రీ దక్షిణామూర్తిని ధ్యానించండి. తెల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం

స్థిరచిత్తంతో చేపట్టిన కార్యాలు సఫలం అవుతాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రత్యర్థులను జయిస్తారు. కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కీర్తి పెరుగుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయం వల్ల భారీగా నష్టపోయే సూచన ఉంది. బుద్ధి నిలకడ లేమి, నోటి దురుసు కారణంగా కొత్త సమస్యలు వస్తాయి. సంతానంతో విభేదిస్తారు. వాత సంబంధ సమస్య ఏర్పడుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త.

పరిహారం: శ్రీసుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయం మెరుగవుతుంది. విధి నిర్వహణలో అంకిత భావం చూపుతారు. తగిన రివార్డులను పొందుతారు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. సోదరుల చిక్కులను తీరుస్తారు. ఆత్మశాంతి లభిస్తుంది. ప్రియమైన వ్యక్తుల కలయిక నూతన ఉత్తేజాన్నిస్తుంది. కీలక సమాచారం అందుతుంది. చెడు ఆలోచనలను నియంత్రించాలి. అందరినీ గుడ్డిగా నమ్మకండి. కీలక నిర్ణయాల్లో విచక్షణతో వ్యవహరించండి. బద్ధకాన్ని విడిచిపెట్టండి. వాహన సంబంధ సమస్య వస్తుంది. నిరాశ పడకండి.

పరిహారం: శ్రీగాయత్రీమాతను పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

సింహం

వ్యవహారాల్లో విశేష లాభం ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. అభివృద్ధి దిశగా చక్కటి ప్రణాళికలను అమలు చేస్తారు. ఆధ్యాత్మిక అంశాలు ప్రేరణ కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. కుటుంబ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ఇరుగు పొరుగుతో చక్కటి బంధాలు ఏర్పడతాయి. అనవసర విషయాల్లో జోక్యం వల్ల అవమానాలు, నిందలు భరించాల్సి వస్తుంది. ఆస్తి లావాదేవీలను వీలైనమేర వాయిదా వేయండి. విడాకులు, రెండో పెళ్లి వ్యవహారాలు కొలిక్కి రావు.

పరిహారం: శ్రీ శనైశ్చరుడిని నువ్వుల నూనెతో అభిషేకించండి. నీలం రంగు దుస్తులను ధరించండి.

కన్య

యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. సోదరులతో అనుబంధం బలపడుతుంది. తెలివితేటలకు చక్కటి ప్రశంసలు లభిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. బాల్యస్మృతులను నెమరు వేసుకుంటారు. ప్రయాణం లాభిస్తుంది. సహచరులతో చక్కటి సంబంధాలు ఉంటాయి. నిరుద్యోగులకు మేలైన వారమిది. అవనసర గొడవలకు దూరంగా ఉండండి. మాట తప్పకండి. ఆస్తి వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం: శ్రీగణపతిని పూజించండి. ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

తుల

ఆశించిన రీతిలో పనులు సాగుతాయి. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్న ఆకాంక్ష బలపడుతుంది. తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇతరుల వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా నడచుకోండి. తొందరపాటు వల్ల బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. వృథా ఖర్చులను తగ్గించాలి.

పరిహారం: శ్రీలక్ష్మీనారాయణులను పూజించండి. గులాబీరంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం

వ్యవహార జయం ఉంది. ప్రతి ప్రయత్నం సఫలం అవుతుంది. పురోభివృద్ధి దిశగా ప్రణాళికలను అమలు చేస్తారు. అదృష్టం వరిస్తుంది. తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. సంతాన వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. వాహనయోగం ఉంది. శుభకార్య నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. విదేశీ ప్రయాణ ప్రయత్నం అనుకూలిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. ఖర్చు తగ్గించండి.

పరిహారం: శ్రీలక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. మెరూన్ రెడ్ కలిసిన దుస్తులను ధరించండి.

ధనుస్సు

పట్టింది బంగారంలా ఉంటుంది. అన్నింటా అనుకూల ఫలితాలే లభిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. ఇతరులతో విభేదాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అధికారులు, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అధికార వృద్ధి ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ బంధాలు బలపడతాయి. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శుభకార్యాచరణ గురించి ఆలోచిస్తారు. రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి. దూరప్రయాణం ఉంది. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది.

పరిహారం: శ్రీకనకదుర్గ అమ్మవారిని పూజించండి. కుంకుమ రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

మకరం

అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అభీష్టం సిద్ధిస్తుంది. ప్రయత్నించిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. మీలోని నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. సంతాన సంబంధ విషయాలు ఆనందపరుస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. రుణ విముక్తి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. పెద్దల ఆశీస్సులను పొందుతారు. బంధాలు బలపడతాయి. దూరప్రయాణం గోచరిస్తోంది. భక్తిభావం పెరుగుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి.

పరిహారం: శ్రీ శివుడిని పూజించండి. ఊదారంగు కలిసిన దుస్తులను ధరించండి.

కుంభం

అన్నింటా అనుకూల ఫలితాలే ఉంటాయి. ఉద్యోగులకు మేలిమి కాలం. అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. మేలిమి అవకాశం అందివస్తుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరప్రాంతంలో స్థిరానివాస ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆలోచనలను అదుపు చేయండి. అనవసర పోటీల్లో పాల్గొనకండి. తండ్రి వ్యవహారశైలిని విభేదిస్తారు. తగాదాలకు దూరంగా ఉండండి. పైత్య సంబంధ సమస్య ఉంటుంది.

పరిహారం: శ్రీ కనకదుర్గమ్మను పూజించండి. ఎరుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మీనం

ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. స్వేచ్ఛను ఆస్వాదిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణం లాభిస్తుంది. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. కోపాన్ని నిగ్రహించుకోండి. చెప్పుడు మాటలను నమ్మకండి. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పరిహారం: శ్రీశనైశ్వరుడిని నువ్వుల నూనెతో అభిషేకించండి. నలుపు వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories