Weekly Horoscope 07 July To 13 July 2024: వారఫలాలు.. ఈ రాశివారు కీలక విషయాల్లో మిత్రుల సలహాలు పాటిస్తే.. అంతా శుభమే..

Weekly Horoscope In Telugu 07th-July-to-13th-July-2024
x

Weekly Horoscope 07 July To 13 July 2024: వారఫలాలు.. ఈ రాశివారు కీలక విషయాల్లో మిత్రుల సలహాలు పాటిస్తే.. అంతా శుభమే..

Highlights

Weekly Horoscope 07 July To 13 July 2024: వారఫలాలు.. ఈ రాశివారు కీలక విషయాల్లో మిత్రుల సలహాలు పాటిస్తే.. అంతా శుభమే..

(07-07-2024 నుంచి 13-07-2024 వరకు)


మేషం :

కార్యసాధనకు బాగా శ్రమించాలి. జరుగుతున్న పరిణామాలు మనసును కష్ట పెట్టినా, కార్యదక్షతను కనబరుస్తారు. ధన సంబంధ ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. సంతానం తీరు కాస్త కలవర పెడుతుంది. కీలకాంశాల్లో మిత్రుల సూచనలు పాటించండి. ఆస్తి క్రయవిక్రయాలు, వాహనం కొనే ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. వారాంతానికి మనోభీష్టం నెరవేరుతుంది. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఖర్చులు తగ్గించండి. శుభ ఫలితాలకు శివుణ్ణి ఆరాధించండి.


వృషభం :

పనులు అనుకున్నంత వేగంగా పూర్తి కావు. ఆటంకాలను దాటాల్సి వుంటుంది. దాయాదులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసుకి హాయిగా ఉంటుంది. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఖర్చులు అదుపు చేయకుంటే అప్పులు చేయాల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందులొస్తాయి. నిరాశ చెందకండి. మానసిక ఒత్తిడిని జయిస్తారు. ఆత్మీయుల కలయిక, వారి సలహాలు మీకు మేలు చేస్తాయి. సంతానం గురించి ఆలోచిస్తారు. శుభ ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరుని పూజించండి.


మిథునం :

ఆటంకాలు సృష్టించే వారు పెరుగుతారు. వ్యవహారాల్లో నష్టమూ గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసంతో కార్యాలు సాధించుకుంటారు. సోదరులు, మిత్రుల తోడ్పాటుతో ఇబ్బందులను పరిష్కరించుకుంటారు. అనవసర జోక్యాల వల్ల నిందలు పడాల్సి వస్తుంది. అప్ర మత్తంగా ఉండండి. ఇంటి వ్యవహారాలపై ప్రత్యేక దృష్టిని పెడతారు. తగిన ఆదాయం సమకూరుతుంది. ఎవరికీ వ్యక్తిగత, సంస్థాపరమైన పూచీలు ఇవ్వకండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు లాభదాయకం కాదు. విఘ్నేశ్వరుని పూజించడం మేలు.


కర్కాటకం :

పనులు అనుకున్నట్లే సాగుతాయి. మనోవాంఛ నెరవేరుతుంది. మీ కార్యదక్షతకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక చిక్కులు క్రమంగా తొలగుతాయి. వాహన యోగం ఉంది. ఇంటి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైన సమాచారం ఆనందాన్నిస్తుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ఉద్యోగులు అధికారుల గుర్తింపును పొందుతారు. మాట నిలుపుకోని కారణంగా ఇబ్బందులు వస్తాయి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. ఖర్చు తగ్గించండి. సాంత్వనకు దుర్గమ్మను పూజించండి.


సింహం :

కార్యసఫలత ఉంటుంది. ప్రతిష్ట పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. కుటుంబ సమస్యలపై దృష్టి పెడతారు. గృహావసరాలను తీరుస్తారు. ఉద్యోగులు రివార్డులను పొందుతారు. మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. సహచరులు ఇబ్బందులు సృష్టించే వీలుంది. వారి కదలికలపై ఓ కన్నేసి వుంచండి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంతాలకు వెళ్లే సూచన ఉంది. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. బద్ధకాన్ని తగ్గించుకుంటే మరిన్ని మంచి ఫలితాలొస్తాయి. నవగ్రహారాధన మేలు.


కన్య :

యోగదాయకంగా ఉంటుంది. అభీష్టాలు నెరవేరతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. అప్పులు తీర్చే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఇంటికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఆత్మీయుల సహకారం కూడా అందుతుంది. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. శత్రువులను జయిస్తారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గిస్తే బావుంటుంది. అవసరానికి మించి ఏ వ్యవహారంలోనూ తలదూర్చకండి. శుభంగా ఉంటుంది.


తుల :

చేపట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. వ్యవహారాలన్నీ లాభదాయకంగా ఉంటాయి. ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. రుణవిముక్తి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారులు, పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలను చేపడతారు. గౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తిగతంగా కొత్త పరిచయాలు మేలు చేస్తాయి. ఇంటి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృథా ప్రయాణాలు మానండి. హద్దుల్లో ఉండి పని చేసుకోండి. ఖర్చులు తగ్గించుకోండి.


వృశ్చికం :

అభీష్టం నెరవేరుతుంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రతివారితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. పురోభివృద్ధికి అవసరమైన మేలిమి అవకాశాలు అంది వస్తాయి. ప్రభుత్వ రంగంలోని వారు కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. సంతానంతో వినోదంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన విషయాలను గ్రహిస్తారు. కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తారు. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి.


ధనుస్సు :

దీక్షాదక్షలతో అవరోధాలను అధిగమించి కార్యాలను సాధించుకుంటారు. అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగులు అధికారుల అభిమానాన్ని పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. అవకాశాలను దుర్వినియోగం చేసుకోకండి. కుటుంబ జీవనం సజావుగా సాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రదేశాలకు వెళ్లే సూచన ఉంది. ఉన్నత విద్యాసంబంధ వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పైత్య సమస్యలుంటాయి. లక్ష్మీనృసింహుణ్ణి పూజించండి.


మకరం :

ప్రయత్నాలు సఫలం అవుతాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. వృథాఖర్చులు చిరాకు పెడతాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. అందరితో చక్కటి సంబంధాలు ఏర్పడతాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం ఉండకండి. తగాదాలకు దూరంగా ఉండండి. దూర ప్రదేశాలకు వెళ్లే సూచన ఉంది. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారు. దైవకార్యాల్లో పాల్గొంటారు.


కుంభం :

పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. వృత్తిగతంగా శుభ ఫలితాలుంటాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల తోడ్పాటు లభిస్తుంది. జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. విజ్ఞానం పెంచుకునేందుకు అనువైన సమయమిది. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. మిత్రులను కలుస్తారు. విందులనిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చినా శాంతంగా ఉండండి. తొందరపాటు వద్దు.


మీనం :

వారమంతా శుభప్రదంగా ఉంటుంది. వ్యవహారాలన్నింటా విజయం చేకూరుతుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. రుణసంబంధ అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంటారు.ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. సంతానం గురించి ఆలోచిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పరమేశ్వరుణ్ణి పూజించండి.Show Full Article
Print Article
Next Story
More Stories