Weekly Horoscope: వారఫలాలు.. మే 26 నుంచి జూన్ 01 వరకు రాశి ఫలాలు

Weekly Horoscope For May 26th To 1st June 2024
x

Weekly Horoscope: వారఫలాలు.. మే 26 నుంచి జూన్ 01 వరకు రాశి ఫలాలు

Highlights

Weekly Horoscope: వారఫలాలు.. మే 26 నుంచి జూన్ 01 వరకు రాశి ఫలాలు

(26-05-2024 నుంచి 01-06-2024 వరకు)


మేషం :

ఈవారం యోగదాయకంగా ఉంటుంది. అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన చాలా అవకాశాలు అందివస్తాయి. సద్వినియోగం చేసుకోండి. శత్రువులు తోకముడుస్తారు. అధికారులు, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. సంతానం వృద్ధిలోకి వస్తుంది. వారం చివరలో ఖర్చులను అదుపు చేయాలి. అనవసర జోక్యాలు వద్దు.


వృషభం :

అభీష్టాలు నెరవేరతాయి. దీర్ఘకాలంగా ఊరిస్తోన్న ఆకాంక్ష నెరవేరుతుంది. ధనలాభం ఉంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ఇతరులతో విరోధం ఏర్పడినా గెలుపు మీకే దక్కుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరించే సూచన ఉంది. ఇంట్లో శాంతి, సమాజంలో గౌరవం లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రులు అన్ని వేళలా తోడుగా ఉంటారు. సంతానానికి సంబంధించిన శుభకార్యాచరణకు అనువైన సమయమిది. గొడవలు సద్దుమణుగుతాయి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. విందుల్లో పాల్గొంటారు.


మిథునం :

ప్రారంభంలో స్వల్ప ఒడుదుడుకులు ఎదురైనా చేపట్టిన పనులు సఫలం అవుతాయి. దూర ప్రాంతానికి వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. బంధువులను కలిసి విందుల్లో పాల్గొంటారు. వృద్ధిలోకి వచ్చే అవకాశాలు దూరమయ్యే సూచన ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. నిర్దేశిత సౌకర్యాలు సమకూరక పోవడం కొంత అసంతృప్తికి కారణమవుతుంది. బలహీనతలను బయటపెట్టకండి. ఖర్చులు అదుపు చేయండి. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది.


కర్కాటకం :

తలపెట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. నూతన వస్తువులను కొంటారు. వాహనసౌఖ్యం ఉంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఇతరులతోనూ సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. కీర్తి పెరుగుతుంది. వారాంతంలో స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. ఉద్రేకాన్ని అదుపు చేసుకోండి. పైత్య సంబంధ సమస్యలు చికాకు పరిచే వీలుంది.


సింహం :

ఈ వారం యోగవంతంగా సాగుతుంది. అభీష్టాలు నెరవేరతాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంది. వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామి పేరిట చేపట్టిన పనులు లాభదాయకంగా ఉంటాయి. నూతన వస్తువులను కొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బయటివారి సహకారంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఓదశలో ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆధ్యాత్మిక మార్గం మేలు చేస్తుంది.


కన్య :

శుభ ఫలితాలు అందుతాయి. అభీష్టం నెరవేరుతుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కొత్త వస్తువులను కొంటారు. సంతాన సంబంధ వ్యవహారం నిరాశను కలిగిస్తుంది. బంధువుల తోడ్పాటుతో కుటుంబ పరిస్థితిని చక్కదిద్దుతారు. విందుల్లో పాల్గొంటారు. నూతన విజ్ఞానాన్ని పొందేందుకు అనువైన కాలమిది. అన్ని ప్రయత్నాలూ సఫలమవుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వృథాఖర్చులను అదుపు చేయండి. విరోధాలకు దూరంగా ఉండండి. కీలకమైన వస్తువులు, డాక్యుమెంట్లను జాగ్రత్తగా దాచండి.


తుల :

మిశ్రమ ఫలితాలుంటాయి. చేపట్టిన ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరచిత్తంతో వాటిని అధిగమిస్తారు. ఆస్తి అమ్మే ప్రయత్నాలు అనుకూలించవు. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీ తెలివి తేటలకు తగిన గుర్తింపు రాదు. పరిణామాలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. బద్ధకాన్ని వదలండి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తల్లి ఆరోగ్యం కలవర పరుస్తుంది. సంతాన సంబంధ వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. శ్రీవేంకటేశ్వరుని పూజించడం మంచిది.


వృశ్చికం :

పనులు నెమ్మదిగా సాగుతాయి. అభీష్టం నెరవేర్చుకునేందుకు బాగా శ్రమించాలి. ఆదాయం మెరుగవుతుంది. అంతేస్థాయిలో ఖర్చులుంటాయి. స్థిరాస్తులను అమ్మే ప్రయత్నాలు అనుకూలించవు. శత్రువులు వృద్ధి చెందుతారు. అనవసర జోక్యాల వల్ల విరోధం పెరుగుతుంది. సొంత తెలివితేటలు ఉపయోగించకండి. తల్లి సోదరవర్గం సాయం తీసుకోండి. సంతాన వ్యవహారాలు అంత సంతృప్తిగా సాగవు. ఆత్మధైర్యాన్ని కోల్పోకండి. ఆత్మీయుల కలయిక నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. గణపతిని పూజించండి.


ధనుస్సు :

మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక సమస్యలుంటాయి. వృథా ఖర్చులు చికాకు పరుస్తాయి. ఇతరుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలోనూ చికాకులు సూచిస్తున్నాయి. నోటిదురుసు తగ్గించుకోండి. బ్యాంకు లావాదేవీలు ఆశించిన రీతిలో సాగవు. మాట నిలుపుకోలేక పోతారు. వారం మధ్యలో అదృష్టం తోడుగా నిలవడంతో కీలక వ్యవహారాన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. కంటి సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. తల్లి ఆరోగ్యం కలవర పరుస్తుంది.


మకరం :

శుభప్రదంగా సాగుతుంది. అడుగడుగునా అదృష్టం కలిసొస్తుంది. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. వాహనయోగం ఉంది. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. దాయాదులతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఎవరికీ పూచీకత్తును ఇవ్వకండి. తగాదాలకు దూరంగా ఉండండి. కంటి సమస్యలుంటాయి.


కుంభం :

కార్యసాధనకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబ వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. కార్యక్షేత్రంలో, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. బంధువుల వైద్యం కోసం ఆసుపత్రిని సందర్శించాల్సి రావచ్చు. మిత్రులతో విరోధం గోచరిస్తోంది. వేళకు భోజనం ఉండదు. బ్యాంకు లావాదేవీలు అనుకూలించవు. నవగ్రహాల్లో శనైశ్చరుడిని పూజించడం మేలు.


మీనం :

పట్టింది బంగారంలా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. వివిధ మార్గాల్లో డబ్బు సమకూరుతుంది. అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులను కలిసి విందువినోదాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ప్రయత్నాలు సానుకూల పడతాయి. శారీరక సౌఖ్యాలను పొందుతారు. విదేశీ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఖర్చులను అదుపు చేయండి. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. మిత్రులను దూరం చేసుకోకండి.

Show Full Article
Print Article
Next Story
More Stories