శుక్రుడు రాశి మారుతుండగా... ఈ మూడు రాశులకు దివ్య ధనయోగం!

శుక్రుడు రాశి మారుతుండగా... ఈ మూడు రాశులకు దివ్య ధనయోగం!
x

శుక్రుడు రాశి మారుతుండగా... ఈ మూడు రాశులకు దివ్య ధనయోగం!

Highlights

జూన్ 29న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పుతో కన్య, వృషభ, మకర రాశుల వారికి ఆర్థిక పురోగతి, శుభ ఘటనలు, వ్యక్తిగత జీవితంలో శాంతి ప్రారంభం కానుంది. మీ రాశి ఉందా చూసేయండి!

జూన్ నెల చివరిలో శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మన జీవితాలపై ప్రభావం చూపుతుందని చెప్పబడుతుంది. ఈ క్రమంలో జూన్ 29 మధ్యాహ్నం 2:17 గంటలకు శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పుతో మూడు రాశులవారికి జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని పండితులు చెబుతున్నారు.

బుధుడు, కుజుడు, సూర్యుడు వంటి శక్తివంతమైన గ్రహాల సంచారంతో పాటు శుక్రుడు కూడా కీలక భూమిక పోషించనుండడంతో, ఈ మూడు రాశులవారి జీవితాల్లో ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఆశాజనకమైన మార్పులు వస్తాయి. వారికి ధన ప్రవాహం ప్రారంభం కానుంది.

అదృష్ట రాశులు ఇవే:

కన్య రాశి:

శుక్ర సంచారం వల్ల కన్య రాశి వారికి లాభాల దారులు తెరుచుకుంటాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా మీరు మంచి స్థితిలోకి చేరుతారు.

వృషభ రాశి:

శుక్రుడు తన సొంతరాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశివారికి సంపద, సౌభాగ్యం పెరుగుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు లభిస్తాయి. అవివాహితులకు ప్రేమాభిమానాలు చిగురించొచ్చు. వివాహయోగం కూడా కలుగుతుంది.

మకర రాశి:

మకర రాశివారికి శుక్రుని అనుగ్రహంతో ఆర్థికంగా స్థిరత ఏర్పడుతుంది. పోటీ పరీక్షలలో విద్యార్థులకు విజయం లభిస్తుంది. జీవితంలో సంతోషం, ఆనందం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

శాస్త్రీయ గమనిక:

ఈ సమాచారం జ్యోతిష శాస్త్రం మరియు పండితుల అభిప్రాయాల ఆధారంగా మీ ఆసక్తి నిమిత్తం అందించబడినది. దీనిలో శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత విశ్వాసాల మేరకు పరిగణించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories