Today’s Horoscope (Jan 03, 2026): ఆ 2 రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు.. మీకు ఎలా ఉందో చూడండి!

Today’s Horoscope (Jan 03, 2026): ఆ 2 రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు.. మీకు ఎలా ఉందో చూడండి!
x
Highlights

నేటి రాశి ఫలాలు (03 జనవరి 2026): ధనుస్సు, మేష రాశుల వారికి నేడు అదృష్ట యోగం పట్టింది. మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ చూడండి.

శనివారం, 03 జనవరి 2026 నేటి పంచాంగం:

  • సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
  • మాసం: పుష్య మాసం (శుక్ల పక్షం)
  • తిథి: పౌర్ణమి (మధ్యాహ్నం 3:35 వరకు), అనంతరం పాడ్యమి.
  • నక్షత్రం: ఆరుద్ర (సాయంత్రం 5:28 వరకు), తర్వాత పునర్వసు.
  • రాహుకాలం: ఉదయం 9:35 నుండి 10:58 వరకు.
  • అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:42 వరకు.

ద్వాదశ రాశి ఫలాలు:

మేష రాశి:

ఈరోజు మీరు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. రిటైల్ వ్యాపారులకు లాభాలు మెండుగా ఉన్నాయి. అధికారులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

  • పరిహారం: వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి.
  • లక్కీ నంబర్: 2, కలర్: గోల్డ్.

వృషభ రాశి:

మీ వాక్చాతుర్యంతో ఆగిపోయిన పనులు చక్కబెడతారు. హోల్‌సేల్ వ్యాపారులకు శుభవార్త అందుతుంది. నూతన వాహనాల కొనుగోలు ప్రస్తుతానికి వాయిదా వేయడం ఉత్తమం.

  • పరిహారం: హనుమంతునికి ఆకు పూజ చేయించండి.
  • లక్కీ నంబర్: 8, కలర్: నీలం.

మిథున రాశి:

చంద్రబలం అనుకూలంగా ఉంది. వెండి, బంగారంపై పెట్టుబడులకు ఇది మంచి సమయం. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి.

  • పరిహారం: రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి.
  • లక్కీ నంబర్: 9, కలర్: పసుపు.

కర్కాటక రాశి:

దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉదయం 11 గంటల సమయంలో ఒక ముఖ్యమైన వార్త వింటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.

  • పరిహారం: గణపతిని ఆరాధించండి.
  • లక్కీ నంబర్: 6, కలర్: ఆకుపచ్చ.

సింహ రాశి:

పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో ఉన్నత వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. అగ్రిమెంట్లపై సంతకం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

  • పరిహారం: పేదలకు ఆర్థిక సాయం చేయండి.
  • లక్కీ నంబర్: 1, కలర్: తెలుపు.

కన్యా రాశి:

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు బాగుంటాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి.

  • పరిహారం: తెల్లని వస్తువులను దానం చేయండి.
  • లక్కీ నంబర్: 3, కలర్: గులాబీ.

తులా రాశి:

ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రైవేటు ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

  • పరిహారం: పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం శ్రేయస్కరం.
  • లక్కీ నంబర్: 11, కలర్: ముదురు పసుపు.

వృశ్చిక రాశి:

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార నిర్ణయాలకు ఈరోజు అనుకూలం కాదు. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.

  • పరిహారం: గోశాలలో ఆవులకు సేవ చేయండి.
  • లక్కీ నంబర్: 9, కలర్: నీలం.

ధనుస్సు రాశి (Lucky Day!):

ఈరోజు మీకు అదృష్ట దినం. మొండి బాకీలు వసూలవుతాయి. సెకండ్ ఇన్‌కమ్ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.

  • పరిహారం: పేదలకు దుప్పట్లు దానం చేయండి.
  • లక్కీ నంబర్: 7, కలర్: ముదురు ఎరుపు.

మకర రాశి:

మీడియా రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. కొత్త ఒప్పందాల వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు అహంభావం ప్రదర్శించవద్దు.

  • పరిహారం: ఆవులకు బెల్లం తినిపించండి.
  • లక్కీ నంబర్: 5, కలర్: లేత నీలం.

కుంభ రాశి:

భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. కీలక ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉంది, నిరాశ చెందకండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయి.

  • పరిహారం: శివునికి ఆవుపాలతో అభిషేకం చేయండి.
  • లక్కీ నంబర్: 4, కలర్: తెలుపు.

మీన రాశి:

ఈరోజు పనులు మందకొడిగా సాగుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు. జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండటం మంచిది.

  • పరిహారం: అమ్మవారిని ఆరాధించండి.
  • లక్కీ నంబర్: 5, కలర్: గచ్చకాయ రంగు.
Show Full Article
Print Article
Next Story
More Stories