Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

Today Rasi Phalalu Check Zodiac Wise Results For Daily Horoscope In Telugu 8th July 2024
x

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

Highlights

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

08-07-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : తదియ పూర్తి

నక్షత్రం: పుష్యమి ఉదయం గం.6.03 ని.ల వరకు ఆ తర్వాత ఆశ్లేష

అమృతఘడియలు: --

వర్జ్యం: రాత్రి గం.7.49 ని.ల నుంచి గం.9.32 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.48 ని.ల నుంచి గం.1.40 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.25 ని.ల నుంచి గం.4.17 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.26 ని.ల నుంచి గం.9.05 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.48 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.55 ని.లకు


మేషం :

కార్యసాధనలో చిక్కులొస్తాయి. స్థిరాస్తి, విద్యారంగాల్లోని వారు నష్టపోయే సూచన ఉంది. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. అవమానాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.


వృషభం :

ఉల్లాసంగా గడుపుతారు. అన్ని వ్యవహారాల్లోనూ అనుకూల ఫలితాలుంటాయి. వేర్వేరు మార్గాల ద్వారా డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది.


మిథునం :

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మాట చెల్లుబాటు కాదు. ఎవరికీ హామీ ఉండకండి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో సాగవు. ఇతరుల వల్ల ఇబ్బందులు పడుతారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.


కర్కాటకం:

అన్ని విధాల కలిసొస్తుంది. ఇంటి అవసరాలను తీరుస్తారు. గౌరవం పెరుగుతుంది. వాహన యోగం ఉంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. అదృష్టం తోడుంటుంది.


సింహం :

వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బద్ధకం పనికిరాదు. వృథా ప్రయాణాలు మానండి. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త.


కన్య :

అందరి సహకారంతో కార్యాల్లో విజయం సాధిస్తారు. అభీష్టం నెరవేరుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రుపీడను తొలగించుకుంటారు. సంతానంపై దృష్టి పెడతారు. అవసరమైన సౌకర్యాలు సమకూరతాయి.


తుల :

స్థిరచిత్తంతో ఉంటారు. ఇష్టకార్యాన్ని సాధించుకుంటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. అధికారుల మన్ననలు పొందుతారు. అవకాశాలు అందివస్తాయి. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది.


వృశ్చికం :

దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఉన్నత విద్యాయత్నాల్లో జాప్యం కనిపిస్తోంది. ఉదర సంబంధ సమస్యలున్నాయి. త్వరగా అలసిపోతారు. వృథా ఖర్చులుంటాయి. పిత్రార్జిత వివాదం కొనసాగుతుంది.


ధనుస్సు :

కార్య సాధనకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఇతరులపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అడ్డదారులు తొక్కకండి. తగాదాలకు దూరంగా ఉండాలి. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. పైత్య సంబంధ సమస్యలుంటాయి.


మకరం :

ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కొత్త విషయాలు తెలిసి వస్తాయి. మీ తెలివితేటలతో సమస్యకు పరిష్కారం చూపి ప్రశంసలు పొందుతారు. బంధాలు దృఢపడతాయి. ప్రయాణాలు ఉపకరిస్తాయి. కీర్తి పెరుగుతుంది.


కుంభం :

ఉద్యోగులకు యోగదాయకమైన రోజిది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పెద్దల ప్రశంసలు పొందుతారు. మిత్రులు తోడుగా నిలుస్తారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.


మీనం :

ఆశించిన ప్రయోజనం దక్కదు. విచారం కలుగుతుంది. బుద్ధికి పదును పెట్టాల్సిన సమయం. నిరాశను వీడి స్థిర చిత్తంతో పనిచేయాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. సంతాన వ్యవహారాలు చికాకు పరుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories