Horoscope Today: నేటి రాశి ఫలాలు.. సోమవారం 20 మే, 2024

Today horoscope in Telugu 20th May 2024
x

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. సోమవారం 20 మే, 2024

Highlights

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. సోమవారం 20 మే, 2024

(తేది : 20-05-2024, సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : ద్వాదశి సాయంత్రం గం.3.58 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి

నక్షత్రం: చిత్త

అమృతఘడియలు: రాత్రి గం.10.42 ని.ల నుంచి అర్ధరాత్రి 12.28 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.12.06 ని.ల నుంచి గం.1.52 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.39 ని.ల నుంచి గం.1.31 ని.ల వరకు తిరిగి గం.3.15 ని.ల నుంచి గం.4.07ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.20 ని.ల నుంచి గం.8.59 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.43 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.43 ని.లకు


మేషం :

చేపట్టిన పనికి అడ్డంకులు ఉంటాయి. కార్యసాధనలో త్వరగా అలసిపోతారు. ముఖ్యమైన సదుపాయాలు సమకూరతాయి. దూర ప్రాంతానికి వెళ్తారు. కలహాలు గోచరిస్తున్నాయి. దుర్గామాతను పూజించండి.


వృషభం :

అనుకున్నట్లుగా పనులు సాగవు. సాటివారిపై దురభిప్రాయాలు ఏర్పడతాయి. అనుమానాల వల్ల స్వల్ప తగాదాలు సూచిస్తున్నాయి. తల, కడుపు సంబంధ సమస్యలు ఉంటాయి. సుబ్రహ్మణ్యుడిని పూజించండి.


మిథునం :

అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. స్వల్పదూర ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు.


కర్కాటకం:

చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. ధనలాభం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవసరమైన వేళ బంధుమిత్రులు తోడుగా నిలుస్తారు. నూతన వస్తువులు కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.


సింహం:

అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రువుల పీడ పెరుగుతుంది. బద్ధకం వీడి కష్టపడితే కార్యాలు విజయవంతం అవుతాయి. సంతానం తీరు నిరుత్సాహ పరుస్తుంది. బద్ధకం వదిలిపెట్టండి. శివారాధన చేయడం మంచిది.


కన్య:

ఆస్తి క్రయవిక్రయాలు వాయిదా వేయండి. బ్యాంకుల వ్యవహారాలు నెమ్మదిస్తాయి. పనుల్లో ఆటంకాలు ఆందోళనను పెంచుతాయి. తల్లివైపు బంధువుల ఆరోగ్యం కలవర పరుస్తుంది. ఇష్టదైవాన్ని పూజించండి.


తుల:

అన్నివైపులా మంచే జరుగుతుంది. ప్రతి పనీ సఫలం అవుతుంది. ధైర్యసాహసాలు పెరుగుతాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబసౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయుల కలయిక తృప్తినిస్తుంది.


వృశ్చికం:

కుటుంబ సభ్యుల వ్యవహారం తలనొప్పిగా మారుతుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. వేళకు భోజనం ఉండదు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. గణపతిని పూజించండి.


ధనుస్సు:

చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. విందుల్లో పాల్గొంటారు. ధనలాభం ఉంది. కీలక సమస్య పరిష్కారంలో అదృష్టం తోడవుతుంది. పురస్కారాలను అందుకుంటారు.


మకరం:

బద్ధకం వల్ల ఇబ్బందులొస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మిత్రుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. మనసు కలతబారుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.


కుంభం:

రోజంతా సుఖసంతోషాలతో సాగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో ఆత్మీయులను కలుస్తారు. అత్యవసర వేళ ఇతరుల నుంచి కూడా సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.


మీనం:

అభీష్టం నెరవేరుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. కార్యాలన్నీ సఫలం అవుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులు, పెద్దల అభిమానాన్ని పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories