Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 10 July 2024

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 10 July 2024
x
Highlights

Today Horoscope in Telugu, 10 July 2024: ఆ రాశి వ్యాపారులకు లాభాల వర్ఫం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

10-07-2024 (బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : చవితి ఉదయం గం.7.51 ని.ల వరకు ఆ తర్వాత పంచమి

నక్షత్రం: మఖ ఉదయం గం.10.15 ని.ల వరకు ఆ తర్వాత పుబ్బ

అమృతఘడియలు: ఉదయం గం.7.37 ని.ల నుంచి గం.9.22 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.7.11 ని.ల నుంచి గం.8.59 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.55 ని.ల నుంచి గం.12.48 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.22 ని.ల నుంచి గం.2.00 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా గం.5.48 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.55 ని.లకు

మేషం :

పనుల్లో ఆటంకాలుంటాయి. వ్యవహార నష్టం విచారాన్ని కలిగిస్తుంది. అనవసర తగాదాలు వస్తాయి. వృథా ఖర్చులుంటాయి. విలువైన వస్తువులను భద్రపరచుకోండి. సాంత్వన కోసం శ్రీ శ్రీనివాసుని పూజించండి.

వృషభం :

ఆస్తి సంబంధ వ్యవహారాలు వాయిదా వేయండి. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. చేపట్టిన కార్యాలు చెడిపోతాయి. ఒత్తిడి పెరుగుతుంది. మనసు నిలకడగా ఉండదు. లలితాదేవిని ఆరాధించడం మేలు చేస్తుంది.

మిథునం :

వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. మీ ధైర్య సాహసాలకుప్రశంసలొస్తాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కర్కాటకం:

ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. ఆర్థిక చికాకులుంటాయి. వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. కుటుంబంలో గొడవలకు ఆస్కారం ఉంది. వేళకు భోజనం ఉండదు. ఖర్చులు పెరుగుతాయి. గణపతిని పూజించండి.

సింహం

అదృష్టం వెన్నంటి వుంటుంది. ప్రతి పనిలోనూ శుభ ఫలితాలుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. గౌరవం దక్కుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. మృష్టాన్న భోజనాలు చేస్తారు.

కన్య

కార్య నిర్వహణ క్రమంలో, ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం, అనూహ్య ఖర్చుల సూచన ఉంది. బంధువులతో స్వల్ప విరోధం గోచరిస్తోంది. బద్ధకం పనికిరాదు. గౌరీదేవిని పూజించండం మంచిది.

తుల

కొత్త విషయాలను గ్రహిస్తారు. మీ నడవడిని మార్చుకుంటారు. ఇష్టమైన వారిని కలుస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. సంతాన సంబంధ సంతృప్తి ఉంటుంది. శుభకార్యాల్లో ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం

అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగులకు అధికార వృద్ధి ఉంది. పెద్దవారి ప్రశంసలు లభిస్తాయి. శత్రుపీడ పోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. గౌరవం పెరుగుతుంది. మనశ్శాంతిని పొందుతారు.

ధనుస్సు

ఊహల్లో కాకుండా వాస్తవ ప్రపంచంలో ఉండాలి. కార్యనిర్వహణలో త్వరగా అలసిపోతారు. చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉండవు. డబ్బు ఖర్చవుతూ ఉంటుంది. శ్రీవేంకటేశ్వరుని పూజించండి.

మకరం

వ్యవహార నష్టం ఇతరులపై దురభిప్రాయాలను కలుగజేస్తుంది. చెడుదారుల్లో వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అనుకున్న సౌకర్యాలు సమకూరక పోవడమే బాధిస్తుంది. శుభ ఫలితాలకు గాయత్రీ మాతను పూజించండి.

కుంభం

అన్ని ప్రయత్నాలూ సఫలమవుతాయి. వృత్తిగత విజ్ఞానాన్ని పెంచుకుంటారు. మిత్రులను కలుస్తారు. అనుబంధాలు గట్టి పడతాయి. ధన సమస్యలుండవు. ప్రశంసలు అందుకుంటారు. మనశ్శాంతి ఉంటుంది.

మీనం

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులు సహకరిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories