Hanuman Jayanthi: 57 ఏళ్ల తర్వాత హనుమాన్‌ జయంతి రోజు పంచగ్రహి యోగం.. ఈ 3 రాశులకు లగ్జరీ లైఫ్‌ ఖాయం..!

Hanuman Jayanthi
x

Hanuman Jayanthi: 57 ఏళ్ల తర్వాత హనుమాన్‌ జయంతి రోజు పంచగ్రహి యోగం.. ఈ 3 రాశులకు లగ్జరీ లైఫ్‌ ఖాయం..!

Highlights

Hanuman Jayanthi Brings Luxury Life: ప్రతి ఏడాది హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. చైత్ర మాసంలో వచ్చే శుక్లపక్షం పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

Hanuman Jayanthi Brings Luxury Life: హనుమాన్ జయంతి శనివారం 12వ తేదీ రానుంది. ప్రతి ఏడాది చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈరోజు హనుమంతుని పుట్టినరోజు అయితే ఈ హనుమాన్ జయంతి మూడు రాశులకు శని ప్రభావం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రోజు నుంచి వీళ్లకు స్వర్ణ యుగమని చెప్పాలి.

57 ఏళ్ల తర్వాత వస్తున్నఅరుదైన హనుమాన్ జయంతి పంచగ్రహి యోగం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మూడు రాశులకు అద్భుత యోగం కనిపిస్తుంది. ఎందుకంటే హనుమంతుడు ఏడు చిరంజీవిలలో ఒకటిగా పరిగణిస్తాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ హనుమాన్ జయంతిని వేడుకగా నిర్వహిస్తారు. ఈసారి అరుదైన గ్రహ కలయిక ఏర్పడుతుంది.

శని, రాహువు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు గ్రహాలు మీనరాశిలో ఉండటం వల్ల పంచగ్రహి యోగం ఏర్పడుతుంది. ఇది కాకుండా లక్ష్మీనారాయణ బుధాదిత్య, త్రిగ్రహి, మాలవ్యయోగం వల్ల కూడా అనేక శుభాలు కలుగుతాయి.

మీన రాశి ..

హనుమాన్ జయంతి నాడు మీన రాశి వారికి అశేష యోగం కలుగుతుంది. వీళ్ళకు ఆ రోజు నుంచి అద్భుతంగా కలిసి వస్తుంది శని నుంచి విముక్తి పొందుతారు.ఈ నేపథ్యంలో వీళ్ళు ఇల్లు లేదా కారు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యక్తిగత జీవితం హాయిగా సాగిపోతుంది. హనుమాన్ దయ వల్ల వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించిన అశేష యోగాలు కలుగుతాయి.

కన్యా రాశి ..

కన్య రాశి వారికి కూడా అద్భుత యోగాలు ఉంటాయి. ప్రధానంగా వీళ్లకు పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యాపారులు ప్రారంభిస్తారు. అంతేకాదు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. హనుమాన్ జయంతి నుంచి కన్యా రాశి వారికి ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోతుంది, లగ్జరీ లైఫ్ వీరి సొంతం.

మిథున రాశి ..

మిథున రాశి వారికి కూడా కెరీర్‌లో మంచి పురోగతి కల్పిస్తుంది. హనుమంతుని ఆశీర్వాదం వల్ల వీళ్లకు శత్రు బాధ కూడా తొలగిపోతుంది. వ్యాపారాలు ప్రారంభిస్తారు. సహోద్యోగుల మద్దతు కూడా భారీగా లభిస్తుంది. ఈ రాశివారు బాస్‌ల ప్రశంసలు కూడా పొందే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories