Scorpio Horoscope 2024: వృశ్చిక రాశివారికి కలిసొచ్చేనా.. ఈ ఏడాది ఆదాయం, ఖర్చు లెక్కలు తెలుసుకోండి..!

Krodhinama Year 2024 Scorpio Horoscope 2024,25
x

Scorpio Horoscope 2024: వృశ్చిక రాశివారికి కలిసొచ్చేనా.. ఈ ఏడాది ఆదాయం, ఖర్చు లెక్కలు తెలుసుకోండి..!

Highlights

ఈ రోజు క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

Scorpio Horoscope 2024: ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ వస్తోంది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ కాబట్టి తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం వచ్చింది. అంటే క్రోధమును కలిగించేదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ ఏడాది ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరు పంచాంగ శ్రవ‌ణం చేయాలి. ఈ సంవ‌త్సరం జాత‌కంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము, క‌ర్నము, వారం ఇలా అన్ని విష‌యాలు తెలుసుకోవాలి. ఈ రోజు క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

ఆదాయం : 8

వ్యయం : 14

రాజపూజ్యం : 4

అవమానం : 5

అదృష్ట సంఖ్య 9

విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు. మీ పేరులోమొదటి అక్షరం తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు

క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వాళ్లకు సామాన్యంగా ఉంటుంది. రైతులు ముహూర్త బలంతో వ్యవసాయం చేయాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు సామాన్యం. లాయర్లు, డాక్టర్లు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్టర్లు టెండర్లు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి వేయాలి. రాజకీయ నాయకులు ఎవరికి, ఏవిధమైన హామీలు ఇచ్చినా ఎక్కడో ఒక చోట ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శుభకార్యాలలో డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తారు. విందు వినోదాల్లో తక్కువ మాట్లాడితే మంచిది. బిగ్ ఇండస్ట్రీ వాళ్లకి కొంత వరకు అనుకూలంగా, స్మాల్ ఇండస్ట్రీ వాళ్లకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. బంగారము, వెండి, కాపర్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. టింబర్, ఐరన్, సిమెంట్, వస్త్ర వ్యాపారులకు ఆదాయం తగ్గును. మత్స్య పరిశ్రమ బ్యాలెన్స్‌గా ఉంటుంది. పౌల్ట్రీ సామాన్యంగా, చిట్స్ బిజినెస్‌ చేసేవారికి కొంత ఇబ్బందులు ఉన్నవి.

షేర్స్ లో పెట్టుబడి పెట్టే వాళ్లకి సామాన్య పరిస్థితి ఉంది. ప్రారంభించిన పనులు ఆగిపోయే పరిస్థితులు ఉన్నవి. విద్యార్థులకు మార్కులు తక్కువగా వస్తాయి. ఉద్యోగంలో లంచం తీసుకొన్నవాళ్లపై ఏసీబీ దాడులు జరుగును. విశాఖ నక్షత్రం వాళ్లు కనక పుష్యరాగం ధరించాలి. దక్షిణామూర్తి పూజలు గురువారం శెనగ గుగ్గిళ్లు చేసి అందరికి పంచాలి.

అనురాధా నక్షత్రం వాళ్లు ఇంద్ర నీలం ధరించాలి. ఎరుపు నువ్వులు కడిగి ఎండపోసినవి కిలోంబావు పూజల అనంతరం దానం చేయాలి. జ్యేష్ట నక్షత్రం వారు జాతి పచ్చ ఉంగరం కుడిచేయి చిటికెన వేలికి ధరించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామికి పూలతో అలంకరణ చేయించి, చక్కెర పొంగలి ప్రసాదములు నైవేద్యంగా పెట్టాలి. మంగళవారం రాత్రి 500 గ్రా. పచ్చపెసలు తెచ్చి నానబెట్టి పావురాలకు దాణాగా వేయాలి. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణలు చేస్తే వారి ఆశీస్సులు లభించి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories