Cancer Horoscope 2024: ఈ ఏడాది కర్కాటక రాశివారికి ఏ విధంగా ఉంటుందంటే..?

Krodhinama year 2024 Cancer Horoscope 2024,25
x

Cancer Horoscope 2024: ఈ ఏడాది కర్కాటక రాశివారికి ఏ విధంగా ఉంటుందంటే..?

Highlights

ఈ రోజు క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

Cancer Horoscope 2024: ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ వస్తోంది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ కాబట్టి తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం వచ్చింది. అంటే క్రోధమును కలిగించేదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ ఏడాది ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరు పంచాంగ శ్రవ‌ణం చేయాలి. ఈ సంవ‌త్సరం జాత‌కంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము, క‌ర్నము, వారం ఇలా అన్ని విష‌యాలు తెలుసుకోవాలి. ఈ రోజు క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

ఆదాయం : 14

వ్యయం : 2

రాజపూజ్యం : 6

అవమానం : 6

అదృష్టసంఖ్య 2

పునర్వసు 4 పాదము, పుష్యమి 1,2,3,4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం హి, హూ, హే, హో, డా, డి, డూ, డే, డో

క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి ధనాదాయం అనుకూలంగా ఉంది. రైతు సోదరులకు వేసిన పంటలకు ధర ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. లాయర్లు, డాక్టర్లకు ఆదాయమునకు కొదవలేదు. కాంట్రాక్టర్లకు రోజులు కలిసివస్తాయి. రాజకీయ నాయకులకు ప్రతి విషయంలో అనుకూలంగా ఉంది. బిగ్ ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ వారికి అనుకూలమైన ఆదాయ వనరులు సమకూరుతాయి. సరస్వతి ద్వాదశ నామాలు చదివిన విద్యార్థులకు మార్కులు అధికంగా వస్తాయి. వెండి, బంగారం, టేకు, ఐరన్, సిమెంట్, కంకర, ఇసుకలో అర్థం కాని దోపిడీ ఉంటుంది. పౌల్ట్రీలో సామాన్య లాభాలు, మత్స్య పరిశ్రమలో హెచ్చు తగ్గులు ఉంటాయి.

రసాయనాలు, కెమికల్స్ వారికి సంతృప్తికర ఆదయం ఉంటుంది. నూతన గృహ నిర్మాణం, బంగారు ఆభరణాలు, వాహన యోగం ఉంటుంది. గృహంలో అవసరమైన అలంకార వస్తువులు, పిల్లల విదేశీయానం, వివాహ ముహూర్తాలు, విందువినోదాలతో గడుపుతారు. బంధుమిత్రుల ఆర్భాటములకు అధిక ధన వ్యయం చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది శత్రు బాధలు ఉన్నా అర్థం కావు. పునర్వసు నక్షత్రము వాళ్లు కనకపుష్యరాగం బంగారంలో ధరిస్తే మంచిది. గురుదర్శనం దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. పుష్యమి నక్షత్రం వాళ్లు ఇంద్రనీలం ధరించాలి.

శనిగ్రహ ఆరాధన నువ్వులు కడిగి ఎండపోసినవి, తైలాభిషేకం, తోలు చెప్పులు, నలుపు గొడుగు, ఇనుప గంటె, నలుపు గొర్రె, నలుపు గొంగళి బ్రాహ్మణునికి దానం చేయాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్లు జాతి పచ్చ రాయి బంగారంతో చేయించి కుడిచేయి చిటికెన వేలుకు ధరించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామికి చక్కెరపొంగలి ప్రసాదములు, స్వామివారికి అలంకరణ చేయించాలి. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయిస్తే అన్ని విషయాలలో పురోగతి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories