Horoscope Today: ఈ రాశుల వారికి గడ్డుకాలం.. ధైర్యం కోల్పోతే కష్టాల్లో కూరుకపోతారు..

Horoscope Today In Telugu 13th May 2024
x

Horoscope Today: ఈ రాశుల వారికి గడ్డుకాలం.. ధైర్యం కోల్పోతే కష్టాల్లో కూరుకపోతారు..

Highlights

Horoscope Today: ఈ రాశుల వారికి గడ్డుకాలం.. ధైర్యం కోల్పోతే కష్టాల్లో కూరుకపోతారు..

(తేది 13-05-2024, సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్ల పక్షం

తిధి : షష్ఠి

నక్షత్రం: పునర్వసు ఉదయం గం.11.23 ని.ల వరకు, ఆ తర్వాత పుష్యమి

అమృతఘడియలు: ఉదయం గం.8.54 ని.ల నుంచి గం. 10.34 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.7.57 ని.ల నుంచి గం.9.40 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.38 ని.ల నుంచి గం.1.30 ని.ల వరకు తిరిగి మధ్యాహ్నం గం 3.14 ని.ల నుంచి సా.గం.4.05 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.22 ని.ల నుంచి గం.8.59 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.5.45 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.40 ని.లకు


మేషం :

ఒత్తిళ్లు ఉంటాయి. డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. భూసంబంధ వ్యవహారాలు వాయిదా వేసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. మీ రహస్యాలు బయటపడే వీలుంది. విష్ణువుని పూజించడం మేలు.


వృషభం :

పనులు సవ్యంగా సాగుతాయి. అన్నివైపులా శుభ ఫలితాలే అందుతాయి. నూతన వస్తు, వస్త్రాలు కొంటారు. కుటుంబ చికాకులు తొలగిపోతాయి. మానసిక సౌఖ్యం ఉంటుంది. ఆత్మధైర్యం వృద్ధి చెందుతుంది.


మిథునం :

పనులు అనుకున్నట్లుగా జరగక పోవడం చికాకును కలిగిస్తుంది. శత్రువులను కనిపెట్టుకుని ఉండండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. కంటి సమస్యను అశ్రద్ధ చేయకండి. లక్ష్మీనృసింహుని పూజించండి.


కర్కాటకం :

శుభప్రదంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధ శుభవర్తమానం అందుతుంది.


సింహం :

బద్ధకం వదిలి పనిచేస్తే పనులు సవ్యంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. బంధుమిత్రుల వ్యవహారాల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.


కన్య :

సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇష్టమైన వారితో విందుల్లో పాల్గొంటారు. అందరి నుంచీ సహకారం లభిస్తుంది. సంతానం గురించిన శుభవార్త వింటారు. నూతన గృహనిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి.


తుల :

అభీష్టం నెరవేరుతుంది. శత్రువులను జయిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. చక్కటి అవకాశాలు అందివస్తాయి. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి.


వృశ్చికం :

అడ్డంకులను దాటేస్తారు. పనుల పూర్తికి కొంత ఆలస్యం ఏర్పడుతుంది. దూర ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. కీర్తి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు.


ధనుస్సు :

అన్ని కార్యాల్లో ఆచితూచి వ్యవహరించండి. అనుకున్న సౌకర్యాలు సమకూరక ఉద్రేక పడతారు. అపోహలు మీ మనసుని చెడగొడతాయి. అయిష్టంగానే పనులు చేస్తారు. బాబా ఆలయాన్ని సందర్శించండి.


మకరం :

ఉత్సాహభరితంగా గడుపుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వస్తు, వాహనాలు కొంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి.


కుంభం :

పనులు విజయవంతంగా సాగుతాయి. ఇంటికి దూరంగా ఉన్నవారు స్వస్థానం చేరతారు. బంధుమిత్రులను కలుస్తారు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. నూతన వస్తువులు కొంటారు. ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది.


మీనం :

మీ ఆలోచనలు సవ్యంగా సాగవు. బద్ధకాన్ని వదిలి కష్టిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ఇతరులతో విరోధం గోచరిస్తోంది. సంతానంతోనూ సఖ్యత చెడుతుంది. వాత సంబంధ సమస్యలుంటాయి. శివరాధన మేలు.

Show Full Article
Print Article
Next Story
More Stories