Horoscope Today: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు.. నిర్లక్ష్యం చేస్తే కష్టమే..

Horoscope Today in Telugu 12th May 2024
x

Horoscope Today: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు.. నిర్లక్ష్యం చేస్తే కష్టమే.. 

Highlights

Horoscope Today: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు.. నిర్లక్ష్యం చేస్తే కష్టమే..

(12-05-2024, ఆదివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్లపక్షం

తిధి : పంచమి మధ్యాహ్నం గం.2.03 ని.ల వరకు.. ఆ తర్వాత షష్ఠి

నక్షత్రం: ఆరుద్ర ఉదయం గం.10.27 ని.ల వరకు.. ఆ తర్వాత పునర్వసు

వర్జ్యం: రాత్రి గం.10.55 ని.ల నుంచి గం.12.35 ని.ల వరకు

దుర్ముహూర్తం : సాయంత్రం గం.4.57 ని.ల నుంచి గం. 5.48 ని.ల వరకు

రాహుకాలం : సాయంత్రం గం.5.03 ని.ల నుంచి గం.6.40 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం. 5-45 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం 6-40 ని.లకు


మేషం : అనుకూలమైన రోజు. శుభఫలితాలను పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


వృషభం : కుటుంబంలో చికాకులను పరిష్కరించాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం జాగ్రత్త. శ్రీనివాసుని పూజించండి.


మిథునం : ఉత్సాహకరమైన రోజు. శారీరక, మానసిక సౌఖ్యాలను పొందుతారు. కొత్త బాధ్యతను చేపడతారు. కుటుంబం నుంచి తోడ్పాటు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. అదృష్టం తోడుగా ఉంటుంది.


కర్కాటకం: అనుకున్నట్లుగా పనులు సాగవు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. పిత్రార్జితాన్ని దక్కించుకోవడంపై శ్రద్ధ పెడతారు. బంధువులతో విరోధం మానసిక అశాంతిని కలిగిస్తుంది. వేళకు భోజనం ఉండదు.


సింహం : శుభప్రదంగా ఉంటుంది. మంచి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రులు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు.


కన్య : అభీష్టం నెరవేరుతుంది. అధికారుల, పెద్దల అభిమానం పొందుతారు. కొత్త బాధ్యత స్వీకరించాల్సి రావచ్చు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.


తుల : కార్యసాధనకు శ్రమించాలి. సంతానం వల్ల చికాకులు ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉంది. బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించకుంటే ఇబ్బందులొస్తాయి. అశాంతి కలుగుతుంది. వృథా ఖర్చులుంటాయి.


వృశ్చికం : కీలక అంశాల్లో తెలివిగా వ్యవహరించండి. బుద్ధి వక్రించే వీలుంది. అనవసర తగాదాల వల్ల ఆత్మీయుల ఆగ్రహానికి గురవుతారు. ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.


ధనుస్సు : శుభప్రదంగా ఉంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. కొత్త వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది.


మకరం : అభీష్టం నెరవేరుతుంది. రాజీ ప్రయత్నాలు ఫలించి, దీర్ఘకాలంగా వేధిస్తోన్న సమస్య పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తువులు కొంటారు.


కుంభం : ఆటంకాలు ఎదురవుతాయి. అభీష్టం నెరవేరక పోవడం చికాకును కలిగిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. మీ తెలివి తేటలకు తగిన గుర్తింపు లభించదు. సంతాన వ్యవహారాలు చికాకుని కలిగిస్తాయి.


మీనం : తొందరపాటు నిర్ణయాలు వద్దు. భూసంబంధ వ్యవహారాలను వాయిదా వేయండి. బంధుమిత్రులతో విరోధం గోచరిస్తోంది. కార్యనష్టానికి తోడు వృథాఖర్చులు మనోవ్యధను కలిగిస్తాయి. దుర్గామాతను పూజించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories