Horoscope Today: ఇతరుల పనుల్లో తలదూర్చితే నిందల పాలే.. ఈ రాశివారు జాగ్రత్త..!

Horoscope Today in Telugu 11th May 2024
x

Horoscope Today: ఇతరుల పనుల్లో తలదూర్చితే నిందల పాలే.. ఈ రాశివారు జాగ్రత్త..!

Highlights

Horoscope Today: ఇతరుల పనుల్లో తలదూర్చితే నిందల పాలే.. ఈ రాశివారు జాగ్రత్త..!

(11-05-2024, శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంతరుతువు, శుక్లపక్షం

తిధి : చవితి (మే 12వ తేదీ తె.వా. గం.2.03 ని.ల వరకు)

నక్షత్రం: మృగశిర (ఉదయం గం.10.15 ని.ల వరకు., ఆ తర్వాత ఆరుద్ర

అమృతఘడియలు: అర్ధరాత్రి గం.12.22 ని.ల నుంచి గం.1.59 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.6.43 ని.ల నుంచి రాత్రి గం.8.20 ని.ల వరకు

దుర్ముహూర్తం : తె.వా. గం 5.46 ని.ల నుంచి 7.29 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం. 8.59 ని.ల నుంచి గం.10.36 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.5.56 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.40 ని.లకు


మేషం : అగ్రిమెంట్లకు అనువైన రోజు. ముఖ్యమైన సమాచారం అందుతుంది. సమీప ప్రయాణం సూచిస్తోంది. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మధైర్యం పెరుగుతుంది.


వృషభం : కార్యాలు అనుకున్నట్లుగా సాగవు. జీవిత భాగస్వామి వృత్తిగత ఇబ్బంది ఎదురవుతుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల నిరాధార నిందను ఎదుర్కొంటారు.


మిథునం : అభీష్టం నెరవేరక పోవడం అశాంతిని కలిగిస్తుంది. మీ తెలివి తేటలకు సరైన గుర్తింపు లభించదు. ఆలోచనలను అదుపు చేసుకోండి. వృథా ఖర్చులుంటాయి. విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోండి.


కర్కాటకం : ఇష్టకార్యం నెరవేరుతుంది. ధనలాభం ఉంది. పొదుపు దిశగా ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు మేలు చేస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కీర్తి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.


సింహం : తోటివారితో కలిసిమెలిసి సాగుతారు. యత్నకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి.


కన్య : అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చితే అవమానాలు తప్పవు. నిర్దేశిత సౌకర్యాలు సమకూరక అశాంతి పెరుగుతుంది. ఇష్టంలేని పనులు చేయాల్సి రావచ్చు. శివారాధన చేయడం ఉత్తమం.


తుల : శత్రువుల బాధ పెరుగుతుంది. కలహాలు అశాంతిని కలిగిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. స్వజనులతోనే విభేదాలు వస్తాయి. ఉదర సంబంధ సమస్యలుంటాయి. అమ్మవారిని పూజించండి.


వృశ్చికం : విశేష గౌరవాభిమానాలను పొందుతారు. యత్నకార్యాలు సులువుగా పూర్తవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పెద్దల అభిమానం పొందుతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


ధనుస్సు : కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. అప్పులు తీర్చే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. శుభకార్య నిర్వహణకు యత్నిస్తారు.


మకరం : వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. బద్ధకాన్ని వదిలిపెట్టండి. విదేశీయానం సూచిస్తోంది. ఆత్మీయుల ఆనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృథాఖర్చులుంటాయి. వేళకు భోజనం ఉండదు. శివారాధన మేలు.


కుంభం : ఇవాళ అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. వాహనయోగం ఉంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. విందుల్లో పాల్గొంటారు. కీలక వేళలో అదృష్టం తోడుగా ఉంటుంది. అంతులేని ఆనందాన్ని పొందుతారు.


మీనం : ధన సంబంధ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అనవసర జోక్యాలు వద్దు. కుటుంబ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. అనుకున్నవి జరగకపోయినా ఆత్మధైర్యం కోల్పోరు. ఎవరికీ పూచీకత్తులు ఇవ్వకండి.

Show Full Article
Print Article
Next Story
More Stories