Vastu Tips: భార్యాభర్తల వైవాహిక జీవితం హ్యాపీగా సాగాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

Follow These Tips For A Happy Married Life According To Vastu
x

Vastu Tips: భార్యాభర్తల వైవాహిక జీవితం హ్యాపీగా సాగాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

Highlights

Vastu Tips: భార్యాభర్తల వైవాహిక జీవితం హ్యాపీగా కొనసాగాలంటే ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వాస్తు ఒకటి.

Vastu Tips: భార్యాభర్తల వైవాహిక జీవితం హ్యాపీగా కొనసాగాలంటే ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వాస్తు ఒకటి. ఇంట్లో గానీ బెడ్‌ రూంలో గానీ వాస్తు నియమాలు పాటించకుంటే దంపతుల మధ్య కలహాలు మొదలవుతాయి. మనం వాస్తు చిట్కాలను పాటించడం వల్ల జీవితాన్ని మధురానుభూతిగా మార్చుకోవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడానికి పడకగదిలో పూల కుండీని పెట్టండి. దీనిని ప్రతిరోజూ శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే కుండీ శుభ్రంగా ఉంటే మీ బంధం కూడా శుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రత లేకపోతే సంబంధం చెడిపోతుంది. వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ ఆనందాన్ని కొనసాగించాలంటే పడకగదిలో భార్యాభర్తల చిరునవ్వుతో కూడిన ఫొటో ఉండాలి. ఇది ఇద్దరి మధ్య మధురమైన సంబంధాన్ని సృష్టిస్తుంది. అయితే ఇది తప్ప బెడ్‌రూమ్‌లో మరో ఫొటో పెట్టకూడదని గుర్తుంచుకోండి. ఇది దంపతుల మధ్య సంఘర్షణ పరిస్థితులను సృష్టిస్తుంది.

పడకగదిలో మంచం మీద తప్పనిసరిగా ఒక బెడ్‌ మాత్రమే ఉండాలి. రెండు పరుపులు ఉన్న మంచం మీ జీవితానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కాకుండా పడకగదిలో తక్కువ వెలుతురు ఉండాలి. భార్యాభర్తలు పడుకునే గది లేత గులాబీ రంగులో ఉండాలని చెబుతారు. గది లోపల ఎప్పుడూ ముదురు రంగులు ఉపయోగించవద్దు. లేత గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు మంచి అనుభూతిని అందిస్తాయి.

ఒత్తిడిని తగ్గించి భాగస్వామిని దగ్గర చేయడంలో తోడ్పడుతాయి. భార్యాభర్తలు పడుకునే గదిలో ఎప్పుడూ దేవుళ్ల ఫొటోలు పెట్టకూడదు. ఈ సమయంలో పాదాల వైపు ప్రవహించే నీటి ఫొటోలను పెట్టాలి. దీంతో వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. ప్రవహించే నీరు ప్రేమకు ప్రతీక అని చెబుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories