Ekadashamsha Yogam: ఏకాదశాంశ యోగం.. ఈ 2 రోజులు 3 రాశులకు ఆకస్మిక ధనలాభం

Ekadashamsha Yogam
x

Ekadashamsha Yogam: ఏకాదశాంశ యోగం.. ఈ 2 రోజులు 3 రాశులకు ఆకస్మిక ధనలాభం

Highlights

Ekadashamsha Yogam 2 Lucky Signs: శుక్రుడు, సూర్యుడు, శని కలయిక వల్ల ఏకాదశ యోగం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మూడు రాశుల వారికి 18, 19 తేదీల్లో అద్భుత యోగాలు ఏర్పడతాయి.

Ekadashamsha Yogam 2 Lucky Signs: శుక్రుడు, సూర్యుడు, శని కలయిక వల్ల ఏకాదశ యోగం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మూడు రాశుల వారికి 18, 19 తేదీల్లో అద్భుత యోగాలు ఏర్పడతాయి.

ఏక దశాంశ యోగం శుక్రుడు, శని, సూర్యుడు వల్ల ఏర్పడుతుంది. ఇది గ్రహాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఈ 18, 19 తేదీల్లో సూర్యుడు, శుక్రుడు, శని కలిసి యోగాన్ని కలవడం వల్ల ఈ ఏకాదశ యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులపై అద్భుత యోగం అందిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి ఆశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఏకదశాంశ యోగం అంటే 360 డిగ్రీలు రాశి చక్రంలో ఉంటే 11 సమాన భాగాలుగా విభజించినప్పుడు యోగం ఏర్పడుతుంది .

వృషభ రాశి ..

ఏక దశాంశ యోగం వల్ల వృషభ రాశి వారికి అద్భుత లాభాలు కలుగుతాయి. శుక్ర, శని, సూర్యుడు కలయిక వల్ల వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అంతేకాదు కుటుంబంలో సఖ్యత మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సమన్వయం ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరించే సమయమని చెప్పొచ్చు. దీంతో వీరి ఆర్థిక పరిస్థితులు కూడా బాగా లాభపడతాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సకాలంలో పూర్తయిపోతాయి.

కర్కాటక రాశి..

ఏకదశ యోగం వల్ల కర్కాటక రాశికి విశేష యోగాలు కలుగుతాయి. వీరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శుభవార్తలు వినే సమయమని చెప్పొచ్చు. ఈ యోగం వల్ల వీళ్ళ కుటుంబంలో సఖ్యత కూడా మెరుగుపడుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు కూడా పొందుతారు. ఈ రెండు రోజులపాటు వీరి జీవితం హాయిగా సాగిపోతుంది.

కుంభరాశి..

ఈ యోగం వల్ల కుంభ రాశి వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. శని అనుగ్రహంతో వీళ్ళకు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైపోతాయి. ఆ పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. ఈ యోగం వల్ల వీళ్లకు సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశం కూడా ఉంది .

మేష రాశి..

ఈ యోగం వల్ల మేష రాశి వారికి విశేషాలు లాభాలు కలుగుతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. శుక్రుడి అనుగ్రహంతో వీళ్ళలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించిన అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి. సూర్యుడు, శని సంయోగం వల్ల వీళ్లు అనుకున్న లక్ష్యాలు కూడా సాధిస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. ఓపిగ్గా ఉండి పని చేస్తే అన్ని సాధించే సమయం.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించడం మేలు)

Show Full Article
Print Article
Next Story
More Stories