Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (8/3/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, March 8, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, March 8, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం

తిధి: నవమి ఉదయం గం.8.16 ని.ల వరకు ఆ తర్వాత దశమి

నక్షత్రం: ఆరుద్ర రాత్రి గం.11.28 ని.ల వరకు ఆ తర్వాత పునర్వసు

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.1.30 ని.ల నుంచి గం.3.05 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.7.54 ని.ల నుంచి గం.9.30 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.6.30 ని.ల నుంచి గం.8.05 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.9.00 ని.ల నుంచి గం.10.30 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.30 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.24 ని.లకు

మేషం

ఆదాయం పెరుగుతుంది. పనులు కూడా ఆశించిన రీతిలోనే పూర్తవుతాయి. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. మిత్రులు తోడుంటారు. కీలక వర్తమానం అందుతుంది. దగ్గరి ప్రాంతానికి ప్రయాణిస్తారు.

వృషభం

ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యవహారాలపై కూడా శ్రద్ధ వహించాలి. అనవసర గొడవలకు ఆస్కారముంది. మాట తూలితే చాలా సమస్యలు వస్తాయి. కంటి సంబంధ సమస్యను నిర్లక్ష్యం చేయకండి.

మిథునం

ధనలాభం ఉంది. వాహనయోగం గోచరిస్తోంది. కుటుంబ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. మీ ఉన్నతిని కోరే వారితో సంప్రదింపులు జరుపుతారు. తెలివితేటలకు ప్రశంసలు అందుతాయి. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది.

కర్కాటకం

ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. అనవసరపు ప్రయాణం వద్దు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. బంధువులే విరోధలయ్యే సూచన ఉంది. మనసు కలతబారుతుంది.

సింహం

అన్ని రకాలుగా లాభసాటిగా ఉంటుంది. సన్నిహితులు తోడుంటారు. గృహావసరాలను తీరుస్తారు. ఇష్టులతో విందులో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

కన్య

తలచిన కార్యం విజయవంతంగా పూర్తవుతుంది. ఆత్మవిశ్వాసం, స్థిరత్వం పెరుగుతాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. గౌరవం వృద్ధి చెందుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తుల

ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. అనవసర ఖర్చులు అశాంతిని పెంచుతాయి. విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలి. సంతానంతీరు కలత పెడుతుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

వృశ్చికం

ప్రత్యర్థుల కారణంగా ధన నష్టం గోచరిస్తోంది. తగాదాలకు దూరంగా ఉండండి. చెప్పుడు మాటలను విలువ ఇవ్వకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వారసత్వపు ఆస్తి లావాదేవీలను వాయిదా వేయడం మంచిది.

ధనుస్సు

ఆర్థికంగా బాగుంటుంది. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి బాగా అనుకూలం. ప్రయాణం లాభిస్తుంది. బంధువులను కలుస్తారు. జీవిత భాగస్వామి సూచనలను పాటించండి.

మకరం

అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. బంధు, మిత్రులు తోడుగా నిలుస్తారు. మనోవేదన తొలగిపోతుంది. న్యాయవివాదాలు కొలిక్కి వస్తాయి. కీలక సమయంలో అదృష్టం వరిస్తుంది. పుణ్యకార్యాల్లో పాల్గంటారు.

కుంభం

మితిమీరిన ఖర్చులు బాధిస్తాయి. శిక్షణలోని విద్యార్థులకు ఆటంకాలు ఏర్పడతాయి. అభీష్టం నెరవేరే సూచన లేదు. నిరాశను వీడి ఆత్మవిశ్వాసంతో కష్టపడాలి. వాత సంబంధ సమస్య ఉంటుంది. బుద్ధి నిలకడగా ఉండదు.

మీనం

ధన సంబంధ అంశాలు బాధను కలిగిస్తాయి. ఆస్తి లావాదేవీలు ఓ కొలిక్కి రావు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెంచాలి. అవమానాలను భరించాల్సి వస్తుంది. రక్త సంబంధీకులు గురించిన విషయాలు ఆశ్చర్యపరుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories