Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (13/3/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, March 13, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, March 13, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం

తిధి: చతుర్దశి ఉదయం గం.10.35 ని.ల వరకు ఆ తర్వాత పౌర్ణమి

నక్షత్రం: పుబ్బ రేపు తె.వా.గం.6.19 ని.ల వరకు

అమృతఘడియలు: రాత్రి గం.11.39 ని.ల నుంచి అర్ధరాత్రి దాటాక గం.1.04 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.12.50 ని.ల చి గం.2.53 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.10.26 ని.ల నుంచి గం.11.14 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.14 ని.ల నుంచి గం.4.02 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.1.30 ని.ల నుంచి గం.3.00 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.26 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.26 ని.లకు

మేషం

సమర్థతకు తగ్గ గుర్తింపు లభించదు. అనవసరమైన చోట తెలివితేటలను ప్రదర్శించకండి. అభీష్టం నెరవేరే సూచన లేదు. విలువైన డాక్యుమెంట్స్ జాగ్రత్త. గొడవలకు ఆస్కారముంది. వాత సంబంధ సమస్య ఉంటుంది.

వృషభం

మనసును నియంత్రించుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. వృథా ఖర్చులు తగ్గించాలి. బంధువిరోధం గోచరిస్తోంది. సమర్థించిన వారే వ్యతిరేకిస్తారు. ఒత్తిడి పెరుగుతుంది.

మిథునం

ఉల్లాసంగా గడుపుతారు. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుని లబ్దిని పొందుతారు. మిత్రులు తోడుగా నిలుస్తారు. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఆత్మశాంతి ఉంటుంది.

కర్కాటకం

తగాదాలకు దూరంగా ఉండండి. మాట చెల్లుబాటు కాదు. ఆర్థికంగానూ నష్టం గోచరిస్తోంది. ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. ప్రతి నిర్ణయాన్నీ ఆచితూచి తీసుకోండి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ చూపండి.

సింహం

సత్ప్రవర్తనతో పెద్దల మనసు గెలుచుకుంటారు. ఎదుగుదలకు తగ్గ సహకారం లభిస్తుంది. ఆర్థిక లాభముంది. గౌరవం పెరుగుతుంది. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

కన్య

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇతరుల వ్యవహారంలో జోక్యం వద్దు. వృథాఖర్చు పెరుగుతుంది. దూరప్రయాణం ఉంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం కూడదు. నిద్రలేమి వేధిస్తుంది. వేళకు భోజనముండదు.

తుల

వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. శారీరక సౌఖ్యం లభిస్తుంది. కొత్త వస్తువులను సమీకరిస్తారు. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. మిత్రులు తోడుంటారు.

వృశ్చికం

ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతకు గుర్తింపు ఉంటుంది.

ధనుస్సు

ఖర్చు అదుపు తప్పుతుంది. అశాంతి పెరుగుతుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. అయినవారితోనే గొడవలొస్తాయి. ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

మకరం

తగాదాలకు వీలుంది. తొందరపాటు చర్యలు వద్దు. చెప్పుడు మాటలు వినకండి. చెడు ఆలోచనలను అదుపు చేయాలి. పోటీల్లో పాల్గొనకండి. ప్రత్యర్థులదే పైచేయిగా ఉంటుంది. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు ఫలించవు.

కుంభం

పనులన్నీ జయప్రదమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. స్వేచ్ఛా జీవితంపై కోరిక పెరుగుతుంది. బంధాలు బలపడతాయి.

మీనం

శుభ ఫలితాలను పొందుతారు. అడ్డంకులు తొలగిపోతాయి. వివాదం పరిష్కారం అవుతుంది. ఆనందం వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా లబ్ది చేకూరుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories