Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (1/3/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, March 1, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, March 1, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

మేషం

వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. అనవసర విషయాల్లో జోక్యం వద్దు.

వృషభం

వ్యవహార జయం ఉంది. అన్ని పనుల్లోనూ శుభ ఫలితాలను పొందుతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ పెడతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథునం

చక్కటి అవకాశాలు అందివస్తాయి. తడబడకుండా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. విందుకు హాజరవుతారు.

కర్కాటకం

అనుకున్న స్థాయిలో పనులు జరగవు. అశాంతి ఏర్పడుతుంది. సంతానం తీరు బాధిస్తుంది. దూర ప్రయాణం ఉంది. న్యాయపరమైన చిక్కులుంటాయి. భవిష్యత్తుపై బెంగ కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

సింహం

తొందరపాటు నిర్ణయాలు వద్దు. పోటీల వల్ల నష్టపోతారు. తగాదాలకూ ఆస్కారం ఉంది. పెద్దల కోపానికి గురవుతారు. వాహనం నడిపేటప్పుడు పరధ్యానం వద్దు. అజీర్తి సమస్య ఏర్పడుతుంది. మనశ్శాంతి ఉండదు.

కన్య

అన్ని ప్రయత్నాలూ సవ్యంగా సాగుతాయి. సహచరుల తోడ్పాటు లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిపై ఆధారపడతారు. కొత్త విషయాలు తెలుస్తాయి. కీర్తి పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

తుల

శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక లాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. సందేహాలు తీరిపోతాయి. మనోవేదన తగ్గుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మిత్రులు తోడుంటారు. సంతోషం పెరుగుతుంది.

వృశ్చికం

తెలివితేటలకు అక్కరకు రావు. ముందుచూపుతో వ్యవహరించండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. సమర్థతకు తగ్గ గుర్తింపు ఉండదు. నీచపు ఆలోచనలను నియంత్రించండి. వృథా ఖర్చులను తగ్గించాలి.

ధనుస్సు

ప్రతి పనికీ అడ్డంకులొస్తాయి. స్థిరాస్తి, మైనింగ్, విద్యా రంగాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి నిలకడగా ఉండదు. విరోధాల వల్ల కార్యనాశనం గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది.

మకరం

విశేష లాభం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నాయకత్వ పటిమతో సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సోదరులు సహకరిస్తారు. ప్రయాణం లాభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కుంభం

ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. కుటుంబ సభ్యుల యోగక్షేమాలపై శ్రద్ధ పెడతారు. ఇతరుల వల్ల ఇబ్బంది పడే సూచన ఉంది. వేళకు భోజనం ఉండదు. ఇతరులకు పూచీగా ఉండడం వల్ల మనశ్శాంతి దూరమవుతుంది.

మీనం

పనులు అనుకున్నట్లే జరుగుతాయి. ఎదిగేందుకు అవసరమైన వాతావరణం ఏర్పడుతుంది. సద్వినియోగం చేసుకోవాలి. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది. విందులో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories