Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (18/1/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (18/1/2025)

Highlights

Daily Horoscope Today In Telugu, January 16, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, January 16, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, ఉత్తరాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం

తిధి: పంచమి పూర్తి

నక్షత్రం: పుబ్బ మధ్యాహ్నం గం.2.51 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తర

అమృతఘడియలు: ఉదయం గం.7.53 ని.ల నుంచి గం.9.38 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.10.51 ని.ల నుంచి అర్ధరాత్రి దాటాక గం.12.37 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.6.50 ని.ల నుంచి గం.8.20 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం. 9.00 ని.ల నుంచి గం.10.50 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.50 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం.6.04 ని.లకు

మేషం

ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకం వదిలి కష్టిస్తే తగిన ఫలితం లభిస్తుంది. అభీష్టం నెరవేరే సూచన లేదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల విరోధం ఏర్పడుతుంది. మేధస్సుకు తగిన గుర్తింపు ఉండదు. నిరాశ వద్దు.

వృషభం

అనుకున్న రీతిలో పనులు సాగవు. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వృథా ఖర్చులు ఉంటాయి. ఆస్తి విక్రయ ప్రయత్నాలను వాయిదా వేయండి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. వాహన సంబంధ సమస్య ఉంటుంది.

మిథునం

అన్నివైపులా మంచి ఫలితాలుంటాయి. ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. సోదరులు తోడుగా నిలుస్తారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది. కీలక సమాచారం ఆనందపరుస్తుంది.

కర్కాటకం

బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. పనులకు ఆటంకాలు వస్తాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల అవమానాలు, నిందలు వస్తాయి. మనసులోని భావాన్ని చెప్పలేక ఇబ్బంది పడతారు. ఖర్చులు తగ్గించండి.

సింహం

అన్ని అనుకూలంగా సాగుతాయి. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వానికి చక్కటి ప్రశంసలు లభిస్తాయి. కీర్తి పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. వాహనయోగం ఉంది.

కన్య

వ్యవహారాలు సజావుగా సాగవు. నమ్మిన వారి వల్ల సమస్యలు వస్తాయి. బంధుమిత్రుల్లో ఒకరి ఆరోగ్యం కలవర పెడుతుంది. వేళకు భోజనముండదు. అనవసర పోటీలకు దిగకండి. వృథా ఖర్చులు పెరుగుతాయి.

తుల

కాలం ఆనందంగా సాగుతుంది. సంతాన సంబంధ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. మిత్రులు తోడుంటారు. రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. బంధాలు బలపడతాయి.

వృశ్చికం

వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగుతాయి. అభీష్టం నెరవేరుతుంది. ఇతరులతో విరోధం ఏర్పడినా విజయం మీకే దక్కుతుంది. అవకాశాలు అందిస్తాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అధికారుల ఆదరాభిమానాలు దక్కుతాయి.

ధనుస్సు

పనులు అనుకున్న రీతిలో సాగవు. ఆర్థిక వ్యవహారాలు కూడా బెడిసికొడతాయి. ప్రతి సందర్భంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. సంతానం తీరు బాధిస్తుంది.

మకరం

తగాదాలకు దూరంగా ఉండండి. చెప్పుడు మాటలు నమ్మకండి. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. చెడుదారులు తొక్కే సూచన ఉంది. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. పోటీల్లో పాల్గొనకండి. మనశ్శాంతి ఉండదు.

కుంభం

ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది.

మీనం

వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. బంధుమిత్రులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories