Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (17/1/2025)

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (17/1/2025)
x
Highlights

రాశిఫలం17-01-2025 (శుక్రవారం)కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, ఉత్తరాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షంతిధి : చవితి రేపు తె.వా. గం.5.30 ని.ల...

రాశిఫలం

17-01-2025 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, ఉత్తరాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : చవితి రేపు తె.వా. గం.5.30 ని.ల వరకు

నక్షత్రం: మఖ మధ్యాహ్నం గం.12.45 ని.ల వరకు ఆ తర్వాత పుబ్బ

అమృతఘడియలు: ఉదయం గం.10.12 ని.ల నుంచి గం.11.54 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.9.27 ని.ల నుంచి గం.11.11 ని.ల వరకు

దుర్ముహూర్తం :ఉదయం గం. 9.04 ని.ల నుంచి గం.9.49 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.49 ని.ల నుంచి గం.1.34 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం 10.30 ని.ల నుంచి గం.12.02 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.50 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం. 6.03 ని.లకు

మేషం :

బద్ధకం వీడి కష్టపడాలి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగవు. సున్నితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సూచన ఉపకరిస్తుంది. పోటీల్లో పాల్గొనకండి ఖర్చు తగ్గించండి.

వృషభం :

బుద్ధి నిలకడగా ఉండదు. దుందుడుకు చర్యల వల్ల కార్యాలు బెడసికొడతాయి. ఆస్తి విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించండి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. రహస్యాలు బయటపడే సూచన ఉంది. వృథా ఖర్చులు ఉంటాయి.

మిథునం :

వ్యవహారాల్లో విశేష లాభం ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలకు కార్యరూపం ఇస్తారు. సానుకూల ఆలోచనలు వస్తాయి. సోదరుల సహకారం లభిస్తుంది. ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. ఆత్మవిశ్వసం వృద్ధి చెందుతుంది.

కర్కాటకం:

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. ఆస్తి సంబంధ నిర్ణయాలను వాయిదా వేయండి. నిందలు వస్తాయి. వేళకు భోజనం ఉండదు. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. ఎవరికీ పూచీ ఇవ్వకండి. కంటి సమస్య ఉంటుంది.

సింహం :

అదృష్టం వరిస్తుంది. వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. విందులో పాల్గొంటారు. వాహనయోగం ఉంది. మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

కన్య :

వ్యవహారాలు ఆశించిన రీతిలో సాగవు. ధననష్టం గోచరిస్తోంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసర జోక్యాలు చేసుకోండి. మిత్రులతో వాగ్వాదం వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. నిద్రలేమి వేధిస్తుంది.

తుల :

శుభప్రదంగా సాగుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. డబ్బు సమస్య ఉండదు. పెద్దలను కలుస్తారు. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. విందుకు హాజరవుతారు.

వృశ్చికం :

ఇష్టకార్యం అనుకూలంగా సాగుతుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇతరులతో విరోధం ఏర్పడినా మీరే గెలుస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. పెద్దల ఆదరాభిమానాలు లభిస్తుంది.

ధనుస్సు :

పనులు అనుకున్నట్లుగా సాగకపోవడం అశాంతిని కలిగిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. శత్రువుల బెడద పెరుగుతుంది. బాధ్యతలను విస్మరించరాదు. పెద్దలను కలుస్తారు. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు.

మకరం :

చెప్పుడు మాటలను నమ్మడం వల్ల సమస్యలు వస్తాయి. పోటీలకు దిగకండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆలోచనలను అదుపు చేయండి. వేళకు సరైన భోజనం ఉండదు.

కుంభం :

అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. బంధుమిత్రులతో వినోదంగా గడుపుతారు. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. స్వేచ్ఛాజీవితాన్ని కోరుకుంటారు. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. కీర్తి పెరుగుతుంది.

మీనం :

చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఇతరులపై ఏర్పడ్డ అపోహలు తొలగిపోతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది. మనోధైర్యం పెరుగుతుంది. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

శుభమస్తు

Show Full Article
Print Article
Next Story
More Stories