Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (4/2/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (7/2/2025)

Highlights

Daily Horoscope Today In Telugu, February 4, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, February 4, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.


మేషం

కార్యసాధనకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో సత్ఫలితాలను సాధిస్తారు. ధనలాభం ఉంది. గౌరవం పెరుగుతుంది. సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుంది. మనశ్శాంతితో గడుపుతారు.

వృషభం

పనులు అనుకున్నంత వేగంగా జరగవు. ఇతరులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. నమ్మినవారు సహకరించరు. పోటీల్లో పాల్గొనకండి. దూర ప్రయాణం గోచరిస్తోంది.

మిథునం

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కార్యసాధన ద్వారా ఆర్థిక లబ్దిని పొందుతారు. నూతన వస్తువులను సేకరిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు.

కర్కాటకం

పనులన్నీ విజయవంతం అవుతాయి. వ్యతిరేకించేవారిని దారిలోకి తెచ్చుకుంటారు. ఉద్యోగులకు సహచరుల తోడ్పాటు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. మనశ్శాంతిని పొందుతారు.

సింహం

చికాకులు వుంటాయి. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. పుణ్యక్షేత్ర సందర్శన ఉంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల వల్ల లాభముండదు.

కన్య

మీకు ఇష్టంలేని రీతిలో వ్యవహారాలుంటాయి. శత్రుపీడ పెరుగుతంది. పోటీలు నిరాశ పరుస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆకస్మిక ధననష్టం ఉంది. కోపాన్ని తగ్గించుకోండి. జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది.

తుల

భాగస్వామ్య వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కొత్త బంధాలు ఏర్పడతాయి. ఆర్థికంగానూ లబ్దిని పొందుతారు. విందుకు హాజరవుతారు. సంతాన విషయాలు ఆనందాన్నిస్తాయి. ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది.

వృశ్చికం

లావాదేవీలన్నీ లాభసాటిగా ఉంటాయి. కార్యసాధనలో అడ్డంకులను తేలిగ్గా దాటేస్తారు. కోర్టు వివాదాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రులు తోడుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పోయిన వస్తువు దొరుకుతుంది.

ధనుస్సు

కార్యసాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకం వదిలి కష్టపడాలి. అభీష్టం నెరవేరదు. సంతానం తీరు చికాకు పెడుతుంది. అనవసర విరోధం ఏర్పడుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మకరం

చేపట్టిన పనులు సవ్యంగా సాగవు. బుద్ధి నిలకడ లోపిస్తుంది. బంధుమిత్రులతోనూ గొడవలకు దిగే సూచనలు ఉన్నాయి. అవమానాలకూ ఆస్కారం ఉంది. గృహ నిర్మాణ యత్నం వద్దు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

కుంభం

వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆదాయం మెరుగవుతుంది. ఉద్యోగ మార్పిడి లేదా పదోన్నతికి సంబంధించిన వార్త అందే సూచన ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.

మీనం

ఇతరుల వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబంలో కూడా చికాకులు వస్తాయి. చెప్పుడు మాటలను నమ్మకండి. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. విడాకుల వ్యవహారం అనూకూలించదు.

Show Full Article
Print Article
Next Story
More Stories