Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (28/2/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, February 28, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, February 28, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం

తిధి: పాడ్యమి రేపు తె.వా. గం.3.16 ని.ల వరకు

నక్షత్రం: శతభిషం మధ్యాహ్నం గం.1.40 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాభాద్ర

అమృతఘడియలు: రేపు తె.వా.గం.4.08 ని.ల నుంచి గం.5.35 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.7.27 ని.ల నుంచి గం.8.54 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.57 ని.ల నుంచి గం.9.44 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.52 ని.ల నుంచి గం.1.39 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.10.30 ని.ల నుంచి గం.12.00 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.35 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.22 ని.లకు

మేషం

ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థిక లబ్ది ఉంటుంది. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మైత్రీబంధం బలపడుతుంది. ఆత్మీయులతో గడుపుతారు. ఆరోగ్యం బావుంటుంది. మనశ్శాంతి లభిస్తుంది.

వృషభం

అధికారవృద్ధి ఉంది. కీలక వ్యవహారంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థికంగా మేలిమి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గౌరవమర్యాదలు పెరుగుతాయి.

మిథునం

భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. జరుగుతున్న పరిణామాలు అశాంతిని కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి. పెద్దలను కలుస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం

తొందరపాటును తగ్గించుకోండి. చెప్పుడు మాటలను నమ్మి నిర్ణయాలు తీసుకోకండి. తగాదాలకు ఆస్కారం ఉంది. పోటీల్లో పాల్గొనకండి. ప్రత్యర్థుల బెడదు పెరుగుతుంది. వారసత్వ ఆస్తి వ్యవహారాలు అనుకూలించవు.

సింహం

నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. సంతాన సంబంధ విషయాల్లో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి.

కన్య

పనులు సవ్యంగా సాగుతాయి. అడ్డంకులను దాటేస్తారు. అపార్థాలు, అనుమానాలు తొలగిపోతాయి. మిత్రులు సహకరిస్తారు. ప్రత్యర్థులపై గెలుస్తారు. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. మనశ్శాంతి వుంటుంది.

తుల

సంతాన సంబంధ వ్యవహారాల్లో అవరోధాలు బాధిస్తాయి. అభీష్టం నెరవేరే సూచన లేదు. ఆలోచనలను అదుపు చేయాలి. నిరాశ, బద్ధకాన్ని వీడి కష్టపడితే మెరుగైన ఫలితాలుంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.

వృశ్చికం

పనులు అనుకున్నట్లుగా సాగవు. బుద్ధి స్థిరంగా ఉండదు. తొందరపాటు వల్ల కార్యనష్టం సూచిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించవు. వాహన సంబంధ సమస్య ఉంది. ఖర్చు తగ్గించాలి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు

సమర్థతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆదాయం మెరుగవుతుంది. సోదరుల సహకారం లభిస్తుంది. సహచరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విందులో పాల్గొంటారు.

మకరం

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. బ్యాంకు లావాదేవీలు ఆశించిన రీతిలో సాగవు. ఇతరుల వల్ల సమస్య వస్తుంది. హామీని నిలుపుకోని కారణంగా మాట పడాల్సి వస్తుంది. రెండో పెళ్లి ప్రయత్నాలు అనుకూలించవు.

కుంభం

పను అనుకున్నట్లే సాగుతాయి. ఆర్థిక లాభం ఉంటుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విందుకు హాజరవుతారు.

మీనం

అనూహ్య ఖర్చులుంటాయి. ఇతరుల వల్ల చిక్కులొస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. బంధువులతో విరోధం గోచరిస్తోంది. పాదాలకు సంబంధించిన సమస్య ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories