Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (26/2/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, February 26, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, February 26, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

మేషం

శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆత్మీయులను కలుస్తారు. ఉద్యోగులు పైఅధికారుల మన్ననలను పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.

వృషభం

అనూహ్యంగా ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుంటే నష్టపోతారు. అశాంతి పెరుగుతుంది.

మిథునం

వారసత్వపు ఆస్తి వ్యవహారాలు అనుకూలించవు. పోటీల్లో పాల్గొనకండి. చెప్పుడు మాటలను విశ్వసించకండి. పెద్దల కోపానికి గురయ్యే వీలుంది. తల, కీళ్లకు సంబంధించిన సమస్య ఉంటుంది.ప్రయాణంలో జాగ్రత్త.

కర్కాటకం

బంధాలు బలపడతాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. విందులో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీల్లో లబ్దిని పొందుతారు. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. శారీరక, మానసిక సౌఖ్యం లభిస్తుంది.

సింహం

అదృష్టం వరిస్తుంది. వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. అపార్థాలు తొలగిపోతాయి. ఆనందంగా గడుపుతారు. ధనాదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది.

కన్య

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకం వీడి శ్రమిస్తే తగిన ప్రయోజనం ఉంటుంది. ఆలోచనలను అదుపు చేసుకోవాలి. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక వ్యవహారంలో ముందుచూపుతో వ్యవహరించండి.

తుల

బుద్ధి నిలకడగా ఉండదు. మిత్రులతోనూ తగాదాలకు ఆస్కారం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. రక్తసంబంధీకులు గురించిన వర్తమానం అందుతుంది.

వృశ్చికం

వ్యవహారాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. నూతన వస్తువులను కొంటారు. కీలక వర్తమానం ఆనందపరుస్తుంది. జీవిత భాగస్వామితో అనురాగం పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

ధనుస్సు

ఆటంకాలను దాటాల్సి వుంటుంది. మాట తప్పడం వల్ల నిందలు పడాల్సి వస్తుంది. భావాన్ని సరిగా వ్యక్తం చేయలేక సమస్యల్లో పడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశించినట్లుగా ఉండవు. కుటుంబంలో చికాకులుంటాయి.

మకరం

అన్ని రకాలుగానూ యోగదాయకమైన రోజిది. అభీష్టం నెరవేరుతుంది. విందులో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. వాహన యోగముంది. ప్రయాణం లాభిస్తుంది.

కుంభం

చేయని తప్పునకు నింద భరించాల్సి వస్తుంది. మనసు కలతబారుతుంది. ఇతరుల వ్యవహారాల్లో అనవసర జోక్యం వద్దు. బద్ధకం వీడి కష్టపడితేనే పనులు కొలిక్కి వస్తాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి.

మీనం

వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. మిత్రులు తోడుంటారు. ఆకాంక్ష నెరవేరుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories