Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (22/2/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, February 22, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, February 22, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.


మేషం

బాధ్యతల నిర్వహణలో జాగ్రత్తగా వుండాలి. ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినా కోపాన్ని బయట పెట్టకండి. అధికారుల కోపానికి గురయ్యే సూచన వుంది. అనవసర పంతాలు వద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

వృషభం

బంధుత్వాలు బలపడతాయి. సంతాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. విజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో వినోదంగా గడుపుతారు.

మిథునం

శుభ ఫలితాలను పొందుతారు. అపార్థాలను తొలగించుకుంటారు. మనసు తేలిగ్గా వుంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా వుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. బలహీనతలను అధిగమిస్తారు.

కర్కాటకం

సామాజిక అంశాలపై అవగాహనను పెరుగుతుంది. సమర్థతకు తగ్గ గుర్తింపుండదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. తొందరపాటు వల్ల గొడవలొస్తాయి. వృథా ఖర్చు తగ్గించాలి. ఆలోచనలను అదుపు చేయాలి

సింహం

అడ్డంకులను తెలివితేటలతో అధిగమించాలి. చెప్పుడు మాటలను విశ్వసించకండి. ఆస్తి లావాదేవీల్లో జాగ్రత్త. రహస్యాలను బయటపెట్టకండి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. శ్వాస సంబంధ సమస్య వుంటుంది.

కన్య

స్వశక్తిపై నమ్మకం మరింత బలపడుతుంది. నాయకత్వ పటిమను ప్రదర్శిస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆదాయం మెరుగవుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణం వినోదంగా సాగుతుంది.

తుల

విలువైన వస్తువులు జాగ్రత్త. ఆదాయానికి మించిన ఖర్చు వుంటుంది. నిందలు భరించాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. ఇతరుల వల్ల ఇబ్బందులు వస్తాయి. వేళకు భోజనం వుండదు. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చికం

వ్యవహార జయం వుంది. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వినోదంగా గడుపుతారు. ఆర్థికంగా లాభపడతారు. వాహన యోగం వుంది. గౌరవం పెరుగుతుంది. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది.

ధనుస్సు

శత్రుపీడ పెరుగుతుంది. దూర ప్రాంతానికి వెళ్లే సూచన వుంది. వృథా ఖర్చులు చికాకు పెడతాయి. ఇతరుల వ్యవహారంలో జాగ్రత్తగా మెలగాలి. వేళకు భోజనముండదు. వృథా ప్రయాణాలు వద్దు. నిద్రలేమి వేధిస్తుంది.

మకరం

ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక సమయంలో సాటివారి తోడ్పాటు లభిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది.

కుంభం

ఆలోచనలు స్థిరంగా సాగుతాయి. యత్నకార్యం ఫలిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం వుంటుంది. మిత్రులతో వినోదంగా గడుపుతారు. పెద్దల మన్ననలను పొందుతారు.చక్కటి గుర్తింపు లభిస్తుంది.

మీనం

సంతానం తీరు చికాకు పెడుతుంది. ఆత్మీయులతోనే విరోధం గోచరిస్తోంది. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. గురు సమానులను కలుస్తారు. కీళ్ల సమస్యలు వుంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories