Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (15/2/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, February 15, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, February 15, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.


మేషం

శుభ ఫలితాలను పొందుతారు. బంధువుల సహకారం లభిస్తుంది. ధనలాభం వుంది. సహచరులతో ఉల్లాసంగా గడుపుతారు. న్యాయపరమైన చిక్కులు తొలగుతాయి. మనోవేదన తొలగుతుంది. విందులో పాల్గొంటారు.

వృషభం

వ్యర్థమైన ఖర్చులు చికాకు పెడతాయి. ఆర్థికపరమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. అభీష్ట సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. భయాందోళనలు వీడి కష్టించండి. అజీర్తి సమస్య వేధిస్తుంది.

మిథునం

కార్యనష్టం విచారాన్ని కలిగిస్తుంది. బుద్ధి నిలకడగా వుండదు. బంధువులతోనే విరోధం ఏర్పడుతుంది. ధన సమస్య వుంటుంది. తల్లివైపు బంధువుల గురించిన సమాచారం అందుతుంది. మనశ్శాంతి వుండదు.

కర్కాటకం

ఆధ్యాత్మిక అంశాల నుంచి ప్రేరణను పొందుతారు. చిత్తశుద్ధితో చేసే పనులన్నీ లాభదాయకంగా వుంటాయి. సోదరులు తోడుంటారు. ప్రయాణం లాభిస్తుంది. కీలక సమాచారం అందుతుంది. ఆత్మశాంతి లభిస్తుంది.

సింహం

అనుకున్నవి జరగవు. మానసిక అశాంతి ఏర్పడుతుంది. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. ఆస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టండి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.

కన్య

ఆకాంక్ష నెరవేరుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ధనలాభం వుంది. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది. ఎదిగేందుకు తగిన అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం బావుంటుంది.

తుల

కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ద్వేషం అనర్థదాయకమని గుర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలు తృప్తిగా సాగవు. మిత్రులతోనూ విరోధం ఏర్పడే సూచన వుంది. అనవసర పోటీలకు దిగకండి. శత్రుపీడ వుంటుంది.

వృశ్చికం

ప్రయత్నాలు సఫలం అవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బావుంటుంది. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. విందులో పాల్గొంటారు.

ధనుస్సు

ప్రయత్నించిన కార్యం సఫలం అవుతుంది. ప్రత్యర్థులపై పైచేయిని సాధిస్తారు. అధికార వృద్ధి గోచరిస్తోంది. కుటుంబంలో ప్రశాంతత వుంటుంది. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. మనశ్శాంతి వుంటుంది.

మకరం

లక్ష్యసాధనకు విపరీతంగా శ్రమించాల్సి వుంటుంది. సంతానం తీరు బాధిస్తుంది. దూరప్రయాణం సూచిస్తోంది. గురు సమానుల ఆశీస్సులను పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వుండకండి.

కుంభం

వ్యవహారాలు గజిబిజిగా తయారవుతాయి. ఇతరులపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. తగాదాలకు వీలుంది. కోపాన్ని అదుపు చేయండి. వాహనం నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా వుండండి. అనవసర పోటీల్లో పాల్గొనకండి.

మీనం

కోరిక తీరుతుంది. ఆనందం పెరుగుతుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. బంధువులతో విందులో పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories