Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Daily Horoscope In Telugu Rasi Phalalu Panchangam Today 8th June
x

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Highlights

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

(తేది 08-06-2024 : శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : విదియ మధ్యాహ్నం గం.3.55 ని.ల వరకు ఆ తర్వాత తదియ

నక్షత్రం: ఆరుద్ర సాయంత్రం గం.7.42 ని.ల వరకు ఆ తర్వాత పునర్వసు

అమృతఘడియలు: ఉదయం గం.9.42 ని.ల నుంచి గం.11.18 ని.ల వరకు

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం : తె.వా.గం.5.41 ని.ల నుంచి గం. 7.26 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.8.58 ని.ల నుంచి గం.10.37 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా.గం.5.41 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.50 ని.లకు


మేషం :

ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి పనిలోనూ శుభ ఫలితాలు అందుకుంటారు. డబ్బు సమస్య ఉండదు. మిత్రుల వల్ల కార్యజయం ఉంది. ఆత్మీయులను కలుస్తారు. ప్రశంసలు పొందుతారు.


వృషభం :

కుటుంబ చికాకులను జాగ్రత్తగా పరిష్కరించాల్సి వుంటుంది. ఆర్థిక లావాదేవీలు అంతగా లాభించవు. పనులు అనుకున్నట్లుగా సాగకపోవడం మనశ్శాంతిని దూరం చేస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి.


మిథునం :

అన్ని పనులూ అనుకున్నట్లే సాగుతాయి. బంధుమిత్రులతో వినోదంగా గడుపుతారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.


కర్కాటకం:

ఆశించిన స్థాయిలో పనులు సాగవు. బద్ధకం కృషి చేయాలి. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. అనూహ్యమైన ఖర్చులుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో అనవసర జోక్యాలు వద్దు.


సింహం :

ఆనందంగా గడుపుతారు. ఆకాంక్ష నెరవేరుతుంది. అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. ఇరుగు పొరుగు నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.


కన్య :

చిత్తశుద్ధితో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. అధికారులు, పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. ఉద్యోగస్తులు శుభ వార్త వింటారు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. శత్రువులు తోక ముడుస్తారు.


తుల :

కార్య నష్టం సూచిస్తోంది. ఆచితూచి అడుగులు వేయండి. ఉద్యోగస్తులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు పెరుగుతారు. దూర ప్రయాణం గోచరిస్తోంది. ఖర్చులూ పెరుగుతాయి. గణపతిని పూజించండి.


వృశ్చికం :

ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. మనశ్శాంతి కరువవుతుంది. ఇతరులపై దురభిప్రాయాలు ఏర్పడతాయి. తగాదాలూ గోచరిస్తున్నాయి. కీళ్లు, జీర్ణ సంబంధ సమస్యలుంటాయి. శివుణ్ణి పూజించండి.


ధనుస్సు :

శుభ ఫలితాలను అందుకుంటారు. వస్తు, వాహన సౌఖ్యం ఉంది. భాగస్వాములతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. శారీరక,మానసిక ప్రశాంతత లభిస్తుంది.


మకరం :

వ్యవహార జయం ఉంది. ఆర్థిక చికాకులు క్రమంగా తొలగుతాయి. నూతన వస్తువులు కొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు.


కుంభం :

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. సోమరితనం మనోవ్యధను మిగులుస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆత్మీయులను సంప్రదించండి. సంతానం వల్ల చికాకులొస్తాయి. వాత సంబంధ సమస్యలుంటాయి.


మీనం :

ఆశించిన ఫలితాలు దక్కవు. డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. అనూహ్య ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. భూసంబంధ వ్యవహారాలు వాయిదా వేసుకోండి. మానసిక ఆందోళన తగ్గేందుకు అమ్మవారిని పూజించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories