Horoscope Today: నేటి రాశి ఫలాలు.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లు ఈ రాశి వారే.. మొదలెట్టిన పనుల్లో విజయమే..

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లు ఈ రాశి వారే.. మొదలెట్టిన పనుల్లో విజయమే..
x

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లు ఈ రాశి వారే.. మొదలెట్టిన పనుల్లో విజయమే..

Highlights

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లు ఈ రాశి వారే.. మొదలెట్టిన పనుల్లో విజయమే..

(తేది: 26-05-2024, ఆదివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : తదియ సా. గం.6.06 ని.లకు తర్వాత చవితి

నక్షత్రం: మూల ఉదయం గం.10.36 ని.లకు తర్వాత పూర్వాషాఢ

అమృతఘడియలు: మే 27 తె.వా.గం 5.01 ని.ల నుంచి ఉ.గం.7.04 ని.ల వరకు

వర్జ్యం: ఉ.9 గం. లనుంచి గం.10.36 ని.ల వరకు మళ్లీ రా.8.03 ని.ల నుంచి గం.9.37 ని.ల వరకు

దుర్ముహూర్తం : సా. గం.5.01 ని.ల నుంచి గం.5.53 ని.ల వరకు

రాహుకాలం : సా. గం.5.07 ని.ల నుంచి గం.6.45 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.42 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం. 6.45 ని.లకు


మేషం :

అకారణ విరోధాలు సూచిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. సంతానం వల్ల చికాకులొస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం అశాంతిని కలిగిస్తుంది. కనక దుర్గను పూజించండి.


వృషభం :

పనులు అనుకున్నట్లుగా సాగకపోవడం సంతాపాన్ని కలిగిస్తుంది. అపోహల వల్ల తగాదాలకు దిగే సూచనలు ఉన్నాయి. ఉద్రేకం మంచిది కాదు. జీర్ణ సంబంధ సమస్యలుంటాయి. శ్రీమన్నారాయణుడిని పూజించండి.


మిథునం :

ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ధనలాభం ఉంది. బంధు,మిత్రులను కలుస్తారు. కొత్తవారితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. విందు,వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. కీర్తి పెరుగుతుంది.


కర్కాటకం:

అభీష్టం నెరవేరుతుంది. స్వస్థలానికి చేరతారు. బంధుమిత్రుల తోడ్పాటు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మానసిక స్థితి దృఢంగా ఉంటుంది.


సింహం:

శుభకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకాన్ని వదిలి కష్టపడాలి. ఆత్మీయులతోనే అకారణ విరోధం సూచిస్తోంది. ఆలోచనలు సవ్యదిశలో సాగవు. మనోవ్యధ పెరుగుతుంది. శ్రీలక్ష్మీనృసింహుడిని దర్శించండి.


కన్య:

మనసు నిలకడగా ఉండదు. పనిలో శ్రద్ధ కనబరచలేరు. ఆదాయానికి మించిన ఖర్చులు చికాకు పెడతాయి. భూసంబంధ వ్యవహారాల్లో జాగ్రత్త. స్వజనులతోనే విరోధం సూచిస్తోంది. దుర్గామాతను పూజించండి.


తుల:

అన్నివైపులా శుభ ఫలితాలే ఉంటాయి. ఆదాయం మెరుగవుతుంది. నూతన వస్త్రాభరణాలు కొంటారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక అమితానందాన్నిస్తుంది.


వృశ్చికం:

మనసుకి కష్టం కలిగే ఘటనలు ఎదురవుతాయి. పరాయి వ్యక్తుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి. కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకండి. గణపతిని పూజించడం మేలు.


ధనుస్సు:

అదృష్టం తోడుగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ధనలాభం ఉంది. ఇంటి వ్యవహారాలు తృప్తినిస్తాయి. బంధువులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అంతులేని ఆనందాన్నిస్తాయి.


మకరం:

పనులు అనుకున్నట్లుగా సాగక పోవడం వేదనను కలిగిస్తుంది. ధననష్టం గోచరిస్తోంది. ఇంటికి దూరంగా వెళతారు. బంధువులతో మాట పడాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. ఆంజనేయుణ్ణి దర్శించండి.


కుంభం:

ఆత్మీయులను కలుస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పని పూర్తవుతుంది. ముఖ్యుల తోడ్పాటు లభిస్తుంది. అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకుంటారు.


మీనం:

స్థిర నిర్ణయాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. బాధ్యతలు పెరుగుతాయి. అవకాశాలను చేజార్చుకోకండి. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories