Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు.. అత్యవసరం అయితేనే అడుగేయండి..

Daily Horoscope In Telugu Rasi Phalalu Panchangam Today 25th May 2024
x

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు.. అత్యవసరం అయితేనే అడుగేయండి..

Highlights

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు.. అత్యవసరం అయితేనే అడుగేయండి..

(తేది: 25-05-2024, శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : విదియ సాయంత్రం గం.6.58 ని. వరకు తర్వాత తదియ

నక్షత్రం: జ్యేష్ట ఉదయం గం.10.36 ని.ల వరకు ఆ తర్వాత మూల

అమృతఘడియలు: 26వ తేదీ తె.వా.గం.4.12 ని.ల నుంచి గం.5.48 ని.ల వరకు

వర్జ్యం: సా. గం.6.36 ని.ల నుంచి రాత్రి గం.8.12 ని.ల వరకు

దుర్ముహూర్తం : తె.వా.గం. 5.42 ని.ల నుంచి ఉ.గం.7.26 ని.ల వరకు

రాహుకాలం : ఉ. గం. 8.58 ని.ల నుంచి గం.10.35 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా.గం. 5.42 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.45 ని.లకు


మేషం :

దూర ప్రాంత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సంతానంతో స్వల్ప విభేదాలు గోచరిస్తున్నాయి. ఉదర సంబంధ చికాకులుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుమారస్వామిని దర్శించండి.


వృషభం :

ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ద్రోహ చింతన శత్రువులను పెంచుతుంది. అధికారులు, పెద్దల కోపానికి గురవుతారు. పైత్య సంబంధ సమస్యలుంటాయి. తగాదాలు వద్దు. శ్రీ వేంకటేశ్వరుని పూజించండం మేలు.


మిథునం :

విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. మధ్యవర్తిత్వాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పోయిన వస్తువు లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. సత్సంబంధాలు ఏర్పడతాయి.


కర్కాటకం:

బాధ్యతల నిర్వహణలో ప్రతిభను కనబరుస్తారు. బ్యాంకు లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పని చేసే చోట పరిస్థితి మెరుగవుతుంది. మిత్రులు తోడుంటారు. గృహోపకరణాలు కొంటారు. ఆరోగ్యం బావుంటుంది.


సింహం :

పనులు అనుకున్నట్లుగా సాగవు. లాటరీల వంటి జూదాలు నిరాశను కలిగిస్తాయి. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లోనూ చికాకులుంటాయి. లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి.


కన్య :

ఇంటి వ్యవహారాలు కాస్త చికాకును కలగిస్తాయి. గుట్టు రట్టుకాకుండా చూడండి. ఆస్తి క్రయవిక్రయాలు వాయిదా వేయండి. గనులు, రియల్ వ్యాపారాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహారాధన మేలు.


తుల :

మార్పు దిశగా మంచి నిర్ణయం తీసుకుంటారు. లక్ష్యసాధనలో సఫలమవుతారు. దాయాదుల బెడద తొలగిపోతుంది. ముఖ్యమైన సమాచారం ఆనందాన్నిస్తుంది. సరికొత్త ఆలోచనలతో విజయం సాధిస్తారు.


వృశ్చికం :

ఆర్థిక క్రమ శిక్షణను పాటించాలి. వ్యాపార, బ్యాంకు వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మాట నిలుపుకునే ప్రయత్నం చేయండి. లేకుంటే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వస్తుంది. మారుతిని పూజించండి.


ధనుస్సు :

ఆశించిన ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ఖర్చులుంటాయి. స్థిరచిత్తంతో ప్రతికూలతలను అధిగమిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త బాధ్యతలతో ప్రతిష్ట పెరుగుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది.


మకరం :

రాబడి కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. చెక్కుల జారీ వ్యవహారాల్లో జాగ్రత్త. అనైతిక వ్యవహారాలు చేటు తెస్తాయి. తగాదాలకు వెళ్లకండి. గణపతిని పూజించండి.


కుంభం :

ఆకాంక్షలు నెరవేరతాయి. వృత్తి ఉద్యోగాల్లో మెరుగుదల ఉంటుంది. గృహశాంతి లభిస్తుంది. వాహనయోగం ఉంది. దూరమైన వారిని మళ్లీ కలుస్తారు. సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది.


మీనం :

అభీష్టం నెరవేరుతుంది. నాయకత్వ బాధ్యతలు తీసుకుంటారు. అప్రమత్తంగా ఉండండి. శత్రువులపై విజయం సాధిస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సుఖప్రాప్తి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories