Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, రిస్క్‌లో పడతారంట..

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam today 23st May 2024
x

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, రిస్క్‌లో పడతారంట..

Highlights

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, రిస్క్‌లో పడతారంట..

(తేది: 23-05-2024, గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్ల పక్షం

తిధి : పౌర్ణమి రాత్రి గం.7.22 ని.ల వరకు

నక్షత్రం: విశాఖ ఉదయం గం.9.15 ని.ల వరకు తర్వాత అనూరాధ

అమృతఘడియలు: రాత్రి గం.11.22 ని.ల నుంచి అర్ధరాత్రి గం.1.02 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.1.24 ని.ల నుంచి గం.3.04 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉ.గం.10.03 ని. ల నుంచి గం.10.55 ని.ల వరకు తర్వాత మ.గం.3.16 ని.ల నుంచి గం.4.08 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.51 ని.ల నుంచి గం.3.29 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.42 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.44 ని.లకు


మేషం :

పనులు అనుకున్నట్లుగా సాగవు. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఇష్టం లేని బాధ్యత చేపట్టాల్సి వస్తుంది. చెప్పుడు మాటలు వినకండి. తగాదాలకు దూరంగా ఉండండి. శనైశ్చరుని పూజించండి.


వృషభం :

పనులు విజయవంతం అవుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. బంధువులను కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కీర్తి పెరుగుతుంది.


మిథునం :

శుభ ఫలితాలుంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది. గృహోపకరణాలకు ఖర్చు చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్వస్థానం చేరుకుంటారు.


కర్కాటకం:

సొంత తెలివి తేటలు వాడకండి. మిత్రుల సూచనలు పాటించండి. సంతానం వ్యవహారశైలి చికాకును కలిగిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. నవగ్రహాలను దర్శించండి.


సింహం:

బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే విరోధం ఏర్పడుతుంది. ఆస్తి క్రయవిక్రయాలు వాయిదా వేయడం మంచిది. జీవిత భాగస్వామి వృత్తిగత జీవితం కలవర పరుస్తుంది. శ్రీనివాసుడిని పూజించండి.


కన్య:

చేపట్టిన పని విజయవంతం అవుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. మిత్రులు తోడుగా ఉంటారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆత్మీయులను కలవడం ఆనందాన్నిస్తుంది.


తుల:

తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. అకారణ విరోధాలు సూచిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. గణపతిని పూజించండి.


వృశ్చికం:

అన్ని రంగాల్లోని వారికీ అనువైన రోజిది. ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. చక్కటి సౌకర్యాలు సమకూరుస్తారు. అవసరమైన వేళ అదృష్టం తోడవుతుంది.


ధనుస్సు :

కార్యాల్లో నష్టం గోచరిస్తోంది. మిత్రుల సహకారంతో ముందుకు సాగండి. దూర ప్రాంతాలకు వెళ్లే సూచన ఉంది. అధిక ఖర్చులు చికాకు పరుస్తాయి. వేళకు భోజనం ఉండదు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.


మకరం:

సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. ఇంటికి కావాల్సిన వస్తువులను కొంటారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.


కుంభం:

చేపట్టిన పని విజయవంతం అవుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది.శత్రువులపై విజయం సాధిస్తారు. అవకాశాలు అందివస్తాయి. ఇంట్లో శాంతి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


మీనం:

వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప అననుకూలతలు ఉంటాయి. నమ్మినవారి వల్లే ఇబ్బందులు వస్తాయి. దూర ప్రాంత బదిలీ గోచరిస్తోంది. మానసిక అశాంతి ఏర్పడుతుంది. శ్రీవేంకటేశ్వరుని పూజించండం మేలు.

Show Full Article
Print Article
Next Story
More Stories