Horoscope Today: మీ కష్టానికి రెట్టింపు ఫలితం పక్కా.. ముందుందంతా మంచి కాలమే..

Daily Horoscope In Telugu Rasi Phalalu Panchangam Today 19th May
x

Horoscope Today: మీ కష్టానికి రెట్టింపు ఫలితం పక్కా.. ముందుందంతా మంచి కాలమే..

Highlights

Horoscope Today: మీ కష్టానికి రెట్టింపు ఫలితం పక్కా.. ముందుందంతా మంచి కాలమే..

(తేది: 19-05-2024, ఆదివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ... మాసం, ఉత్తరాయణం, ... రుతువు, .... పక్షం

తిధి : ఏకాదశి మధ్నాహ్నం గం.1.50 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి

నక్షత్రం: హస్త

అమృతఘడియలు: రాత్రి గం.8.33 ని.ల నుంచి గం.10.20 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం. 9.48 ని.ల నుంచి గం.11.35 ని.ల వరకు

దుర్ముహూర్తం : సాయంత్రం గం.4.59 ని.ల నుంచి గం.5.51 ని.ల వరకు

రాహుకాలం : సాయంత్రం గం.5.05 ని.ల నుంచి గం.6.43 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం. 5.43 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం. 6.43 ని.లకు


మేషం : శత్రువులపై విజయం సాధిస్తారు. అందరి విశ్వాసాన్ని పొందుతారు. ధనలాభం ఉంది. నూతన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామికి వైద్య చికిత్సలు అవసరం అవుతాయి. బంధువుల సహకారం లభిస్తుంది.


వృషభం : బద్ధకాన్ని వదిలి పనిచేయాలి. అభీష్టం నెరవేర్చుకునేందుకు ఆటంకాలను దాటాల్సి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. సంతానం నిరాశ పరుస్తుంది. వాత సమస్యలుంటాయి. సుబ్రహ్మణ్యుడిని దర్శించండి.


మిథునం : అప్రమత్తంగా వ్యవహరించండి. మనోద్రేకం కారణంగా గొడవలు వస్తాయి. బంధువులే విరోధులయ్యే సూచన ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు చికాకు పరుస్తాయి. తల్లివైపు బంధువుల ఆరోగ్యం కలవరపరుస్తుంది.


కర్కాటకం : ధైర్యసాహసాలతో చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. కష్టానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిత్రులు తోడుగా ఉంటారు. ఆత్మీయుల కలయిక నూతనోత్తేజాన్నిస్తుంది.


సింహం : ఆటంకాలను దాటాల్సి ఉంటుంది. మనసుకి కష్టం కలిగినా ఆత్మధైర్యంతో అధిగమిస్తారు. మాట తప్పడం వల్ల నిందలు తప్పవు. వేళకు భోజనం ఉండదు. వృథాఖర్చులుంటాయి. పరాశక్తిని పూజించండి.


కన్య : అదృష్టం వరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. శారీరక సౌఖ్యం లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది.


తుల : పనులు సవ్యంగా సాగవు. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. జీవిత భాగస్వామికి ఆరోగ్యం బావుండదు. వేంకటేశ్వరుని పూజించండి.


వృశ్చికం : ఆనందమయంగా ఉంటుంది. ఆకాంక్షలు నెరవేరతాయి. విందుల్లో పాల్గొంటారు. ఇల్లు నిర్మించే ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి.


ధనుస్సు : అభీష్టం నెరవేరుతుంది. చేపట్టిన పని విజయవంతం అవుతుంది. జీవితభాగస్వామి తరఫున శుభవార్త వింటారు. మంచి అవకాశాలు అందివస్తాయి. అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. కీర్తి పెరుగుతుంది.


మకరం : అడ్డంకులను అధిగమిస్తారు. అవసరమైన మేర డబ్బు సమకూరుతుంది. సంతానం తీరు అసహనానికి కారణమవుతుంది. కడుపు సంబంధ సమస్యలుంటాయి. త్వరగా అలసిపోతారు. నవగ్రహ ప్రదక్షిణ చేయండి.


కుంభం : ఆటంకాలను అధిగమిస్తారు. అనుకున్నట్లుగా పని సాగకపోవడం చిరాకును కలిగిస్తుంది. అపోహల వల్ల చెడుదారులు తొక్కే వీలుంది. మనోద్రేకాన్ని అదుపు చేసి సంయమనం పాటించండి. గణపతిని పూజించండి.


మీనం : సర్వత్రా శుభప్రదంగా ఉంటుంది. వస్తు, వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories