Horoscope Today: ఈ రోజంతా మీకు అదృష్టమే.. కొత్త బాధ్యతలు కోరి వస్తాయంతే..

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Today 14th May 2024
x

Horoscope Today: ఈ రోజంతా మీకు అదృష్టమే.. కొత్త బాధ్యతలు కోరి వస్తాయంతే..

Highlights

Horoscope Today: ఈ రోజంతా మీకు అదృష్టమే.. కొత్త బాధ్యతలు కోరి వస్తాయంతే..

(తేది: 15-05ర-2024, బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్ల పక్షం

తిధి : అష్టమి

నక్షత్రం: ఆశ్లేష మధ్యాహ్నం గం.3.25 ని.ల వరకు ఆ తర్వాత మఖ

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.1.40 ని.ల నుంచి గం.3.25 ని.ల వరకు

వర్జ్యం: మే 16 తె.వా.జామున గం. 4.50 ని.ల నుంచి గం.6.37 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం 11.47 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.39 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం 12.13 ని.ల నుంచి గం.1.50 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.5.44 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.41 ని.లకు


మేషం : కార్యనష్టం గోచరిస్తోంది. అప్రమత్తంగా వ్యవహరించండి. వృథాఖర్చులు అశాంతిని మిగులుస్తాయి. బుద్ధి నిలకడగా ఉండదు. సోదరుల ఆర్థిక స్థితి ఆందోళన కలిగిస్తుంది. శ్రీవేంకటేశ్వరుని దర్శనం మేలు చేస్తుంది.


వృషభం : కీలక సమస్య పరిష్కారంలో సోదరులు తోడుగా ఉంటారు. చేపట్టిన పని శుభప్రదంగా పూర్తవుతుంది. కావాల్సినంత డబ్బు చేతికందుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆత్మధైర్యం పెరుగుతుంది.


మిథునం : బ్యాంకు లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి. డబ్బు దొంగతనమయ్యే సూచన ఉంది. ఎవరికీ పూచీకత్తు ఉండకండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యారాధన మేలు చేస్తుంది.


కర్కాటకం: వ్యక్తిగత ప్రతిష్ట రెట్టింపు అవుతుంది. కొత్త బాధ్యతల్లో ఒదిగిపోతారు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. విందుల్లో పాల్గొంటారు. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. ఇవాళంతా మీకు అదృష్టం తోడుగా ఉంటుంది.


సింహం: చేపట్టిన పనిలో ఆటంకాలను అధిగమిస్తారు. వేళకు భోజనం ఉండదు. దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. బంధువుల చికిత్స కోసం ఆసుపత్రిని సందర్శించాల్సి రావచ్చు. లక్ష్మీనరసింహ స్వామిని పూజించండి.


కన్య: ఆనందదాయకంగా ఉంటుంది. ధనసంబంధ సమస్యలు తీరతాయి. ఆత్మీయులను కలుస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. నూతన స్నేహాలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన ఆకాంక్షలు నెరవేరతాయి.


తుల: అన్నింటా అనుకూలంగా ఉంది. ఇంటా బయటా జయాలను అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. అవకాశాన్ని చేజార్చుకోకండి. ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.


వృశ్చికం: చేస్తున్న పనుల్లో నిర్లక్ష్యం వద్దు. నమ్మినవారి నుంచే ఇబ్బందులొస్తాయి. దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. కలహాలకు దూరంగా ఉండండి. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. దుర్గామాతను పూజించండి.


ధనుస్సు: పనులు అనుకున్నట్లుగా సాగకపోవడం ఇబ్బందిగానే ఉంటుంది. అధికారులు, పెద్దల వ్యవహారాల్లో జాగ్రత్త. చెప్పుడు మాటలను నమ్మకండి. ఉద్రేక పడితే అవమానం తప్పుదు. గణపతిని పూజించడం మేలు చేస్తుంది.


మకరం: చేపట్టిన పని విజయవంతం అవుతుంది. డబ్బు నిల్వ ఉంటుంది. వాహనయోగం ఉంది. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.


కుంభం: సర్వత్రా శుభ ఫలితాలు అందుకుంటారు. ధనలాభం ఉంది. నూతన వస్తువులను కొంటారు. కీలక సమయంలో బంధుమిత్రులు తోడుగా ఉంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.


మీనం: బద్ధకాన్ని వీడితే ఆటంకాలను అధిగమించగలుగుతారు. అభీష్టం నెరవేరక పోయినా నిరాశ చెందకండి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి బావుంటుంది. మిత్రులు తోడుంటారు. లక్ష్మీనారాయణులను పూజించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories