Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Daily Horoscope In Telugu Rasi Phalalu Panchangam Today 11th June
x

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Highlights

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

తేది : 11-06-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్లపక్షం

తిధి : పంచమి సా. గం.5.27 ని.ల వరకు తర్వాత షష్ఠి

నక్షత్రం: ఆశ్లేష రాత్రి గం.11.39 ని.ల వరకు తర్వాత మఖ

అమృతఘడియలు: రాత్రి గం.9.55 ని. లనుంచి రా. గం. 11.54 ని. ల వరకు

వర్జ్యం: ఉ. గం. 11.31 ని. ల నుంచి మధ్యాహ్నం గం. 1.15 ని. ల వరకు

దుర్ముహూర్తం : ఉ. గం.8.19 ని.ల నుంచి గం. 9.12 ని. ల వరకు మళ్లీ రాత్రి గం. 11.11 ని.ల నుంచి గం.11.54 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం. 3.33 ని.ల నుంచి గం.5.12 ని.ల వరకు

సూర్యోదయం : ఉ.గం.5.41 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.51 ని.లకు


మేషం :

తలచిన పనులు త్వరగా పూర్తి కావు. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ముందుకు సాగవు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామిని పూజించండి.


వృషభం :

పనులు సవ్యంగా సాగుతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు. కీలకమైన సమయంలో మిత్రులు తోడుంటారు. శుభఫలితాలు పొందుతారు.


మిథునం :

అనుకున్న కార్యాలు జరగవు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మాట నిలుపుకోని కారణంగా అవమానాలకు గురయ్యే సూచన ఉంది. ఖర్చులూ పెరుగుతాయి. లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి.


కర్కాటకం:

మీ కార్యదక్షతకు ప్రశంసలు లభిస్తాయి. అంతులేని ఆనందాన్ని పొందుతారు. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు సజావుగా ఉంటాయి. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. ధనలాభం ఉంది.


సింహం :

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. బంధువుల వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. దత్తాత్రేయుడిని పూజించండి.


కన్య :

అన్నీ అనుకున్నట్లే సాగుతాయి. ఆదాయం మెరుగవుతుంది. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. మీ ఆకాంక్ష నెరవేరుతుంది. మిత్రులు తోడుగా నిలుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. మనశ్శాంతి ఉంటుంది.


తుల :

ప్రయత్నించిన కార్యాలు సఫలమవుతాయి. ఇష్టమైన కార్యం నెరవేరుతుంది. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. ఇంట్లో శాంతి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. అధికారుల అభిమానాన్ని పొందుతారు.


వృశ్చికం :

పిత్రార్జిత ఆస్తులు చికాకులను కలిగిస్తాయి. అయిన వారితోనే విరోధం గోచరిస్తోంది. డబ్బులు బాగా ఖర్చవుతాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. మనోధైర్యం వదలకండి. సాయిబాబాను పూజించండి.


ధనుస్సు :

పనులు అనుకున్నట్లుగా జరగవు. ఆటంకాలను అధిగమించాలి. స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. చెప్పుడు మాటలు విని అపోహలు పెంచుకోకండి. గణపతిని పూజించండి.


మకరం :

ఉల్లాసంగా గడుపుతారు. మీ కార్యాలకు ఇతరుల నుంచీ సహకారం లభిస్తుంది. సంబంధాలు దృఢపడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు.


కుంభం :

శుభ ఫలితాలను పొందుతారు. ధనాదాయం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంది. బంధు, మిత్రులు తోడుగా నిలుస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.


మీనం :

కార్యసాధనలో ఆటంకాలను అధిగమించాల్సి వుంటుంది. పరిచయస్తులతో విరోధం వృద్ధి చెందే సూచన ఉంది. మీ తెలివి తేటలకు గుర్తింపు ఉండదు. వాత సమస్యలుంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories